Om Raut: రణ్‌వీర్‌ సినిమాను ప్రభాస్‌ డైరక్టర్‌ పట్టేశాడా!

ఓ సినిమా మీద రెండు మూడేళ్లు కూర్చోవడం, ఆ తర్వాత రెండేళ్లు మొత్తం పనులు చూసుకొని విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు ఓం రౌత్‌. ప్రభాస్‌తో ‘ఆదిపురుష్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా తర్వాత ఓం రౌత్‌ సినిమా ఇదే అంటూ ఓ పుకారు వినిపిస్తోంది. ఒకవేళ అది జరిగితే ఓం రౌత్‌ లెవల్‌ మామూలుగా ఉండదు అంటున్నారు.

ప్రస్తుతం ఓం రౌత్‌ చేస్తున్న ‘ఆది పురుష్‌’ బడ్జెట్‌ రూ. 500 కోట్లు అని టాక్‌. ఈ సినిమా తర్వాత చేయబోయేది కూడా అలాంటి భారీ బడ్జెట్‌ సినిమానే అని టాక్‌. ‘తానాజీ’ పనినం, ‘ఆదిపురుష్‌’ రషెష్‌ చూసి ఓం రౌత్‌ను సోనీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సినిమా చేయడానికి ముందుకొచ్చిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? మన సూపర్‌ హీరో ‘శక్తిమాన్‌’ సినిమా. టీవీ సీరియల్‌గా 90వ దశకంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ముఖేష్ ఖన్నా నటించిన ఈ బ్లాక్ బస్టర్ క్యారెక్టర్‌ను వెండి తెర మీదికి తీసుకురావడానికి సోనీ పిక్చర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘శక్తిమాన్‌’గా వెండితెరపై రణ్‌వీర్‌ సింగ్‌ కనిపిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. 90వ దశకంలో దేశాన్ని ఓ ఊపు ఊపేసిన సూపర్‌ హీరో ‘శక్తిమాన్‌’. ఈ పాత్ర సృష్టికర్త ముఖేష్‌ ఖన్నా. ఇప్పటికీ ఆయన ఎక్కడా కనిపించినా ఆ పేరుతోనే పిలుస్తారు అంటే ఆ పాత్ర పవర్‌ అర్థం చేసుకోవచ్చు.

ఇందులో హీరో పాత్ర కోసం రణ్‌వీర్‌ సింగ్‌తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. రణ్‌వీర్‌ ఇలాంటి పాత్రలు చేయాలంటే చాలా ఆసక్తి చూపిస్తుంటాడు. దీంతో అతనే సినీ ‘శక్తిమాన్‌’ అవ్వొచ్చు అని అంటున్నారు. ‘శక్తిమాన్‌’ సీరియల్‌ గురించి చూస్తే దూరదర్శన్‌లో మొత్తంగా 520 ఎపిసోడ్‌లు టెలీకాస్ట్‌ చేశారు. సెప్టెంబరు 13, 1997 నుండి మార్చి 27, 2005 వరకు ఈ సీరియల్‌ టెలీకాస్ట్‌ చేశారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus