అల్లు అర్జున్ సినిమాని ఏకంగా అంత పెట్టి కొంటున్నారా?

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘రేసుగుర్రం’ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న బన్నీకి ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మధ్యలో ‘సరైనాడు’ వంటి హిట్ ఉన్నప్పటికీ ఆ చిత్రం ఓవర్సీస్ లో ప్లాప్ అయ్యింది. కానీ ‘అల వైకుంఠపురములో’ చిత్రమే అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బన్నీ ఆకలి తీర్చింది.

త్రివిక్రమ్ డైరెక్షన్ కన్నా తమన్ మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీ రైట్స్ ను భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రముఖ హిందీ నిర్మాత అశ్విన్ వార్డే భారీ రేటు పెట్టి ‘అల వైకుంఠ పురములో’ రైట్స్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలో ఈయన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసి అక్కడ ‘కభీర్ సింగ్’ గా రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టారు.

ఈ చిత్రం అక్కడ ఏకంగా 300 కోట్ల పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ చిత్రం కూడా ఇదే స్థాయిలో విజయం సాధిస్తుందేమో చూడాలి. ఇక ఈ రీమేక్ లో మొదట సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తాడు అని వార్తలు వచ్చాయి కానీ.. అక్షయ్ కుమార్ లేదా షాహిద్ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus