61 ఏళ్లలో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న కింగ్ నాగార్జున..!

అక్కినేని అందగాడు.. ‘కింగ్’ నాగార్జున మంచి స్పీడ్ మీదున్నాడు. ఈ మధ్యనే ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రాన్ని పూర్తి చేసిన నాగ్.. అటు తరువాత ‘బ్రహ్మస్త్ర’ షూటింగ్ కోసం ముంబై వెళ్ళాడు. నిన్నటితో ఆ చిత్రానికి సంబంధించి తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసేసాడు.ఇది కూడా పాన్ ఇండియా మూవీనే..! హిందీతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో కూడా ఏక కాలంలో విడుదల కాబోతుంది ఈ చిత్రం.

అయాన్ ముఖ‌ర్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ర‌ణ‌బీర్ క‌పూర్, అలీయ‌భ‌ట్ వంటి స్టార్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇలా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యిందో లేదో వెంటనే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో సినిమాని మొదలుపెట్టేశాడు నాగ్. ఇది కూడా ‘పి.ఎస్.వి.గరుడ వేగా’ లానే థ్రిల్లర్ సబ్జెక్టు అని తెలుస్తుంది. దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్.. కొన్ని నెలల నుండీ ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూ వచ్చాడు. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు,

శరత్ మరార్ వంటి బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను మంగళవారం సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయంలో నిర్వహించారు. ఓపెనింగ్ సీన్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ కొట్టారు. నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం ఇది తెలుస్తుంది. 61ఏళ్ళ వయసులో కూడా నాగార్జున ఇలా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తుండడం కుర్ర హీరోలకు కూడా షాక్ ఇచ్చే అంశం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus