Jr NTR: కొరటాల తర్వాత ఎన్టీఆర్‌ సినిమా ఇదేనా?

ఎన్టీఆర్‌ – అనిల్ రావిపూడి టైమింగ్‌ భలే కుదురుతుంది. ఇదేంటి ఇప్పటివరకు ఇద్దరూ కలసి సినిమా చేయలేదు కదా ఎలా చెబుతున్నారు అనుకుంటున్నారా? అవును వాళ్లు సినిమా అయితే చేయలేదు కానీ ఓ ఇంటర్వ్యూ అయితే చేశారు కదా. అది చూసి చెబుతున్నాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఇటీవల రాజమౌళి, రామ్‌చరణ్‌, తారక్‌ను అనిల్‌ రావిపూడి స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో తారక్‌ – అనిల్‌ పంచ్‌ల మీద పంచ్‌లు వేసుకున్నారు. అలాంటి కాంబోలో సినిమా వస్తే బాగుండు అని ఎవరికి ఉండదు చెప్పండి.

Click Here To Watch NOW

చాలామంది ఇదే మాట గట్టిగా అనుకున్నారో ఏమో.. ఆ కాంబినేషన్ ఓకే అయ్యింది అని లేటెస్ట్‌ టాక్‌. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేస్తుందని చెబుతున్నారు. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని కూడా సమాచారం. అనిల్‌ దగ్గర ఒక మంచి కథ ఉందని తారక్‌కు దిల్‌ రాజు చెప్పడం, ఆయన విని ఓకే చేసేయడం చకచకా జరిగిపోయాయని టాక్‌. త్వరలో మరోసారి కలసి కూర్చుని మాట్లాడుకుని అఫీషియల్‌గా చెబుతారని అంటున్నారు.

ప్రస్తుతం అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేస్తారు. ఆ తర్వాతే ఎన్టీఆర్‌ సినిమా ఉంటుంది. మరోవైపు తారక్‌ త్వరలో కొరటాల శివ సినిమా మొదలుపెడతారు. ఆ సినిమా అయిన తర్వాత బుచ్చిబాబు సినిమా ఉంటుందని భోగట్టా. ఆ తర్వాతనే అనిల్‌ రావిపూడి సినిమా అంటున్నారు. లేదంటే అనిల్ ముందుకు, బుచ్చిబాబు వెనక్కి వెళ్లే అవకాశమూ ఉంది.

ఒకవేళ తారక్‌తో అనిల్ రావిపూడి సినిమా చేస్తే.. ప్రజెంట్‌ నందమూరి హీరోలందరితోనూ అనిల్ సినిమా చేసినట్లు అవుతుంది. కల్యాణ్‌రామ్‌కి ‘పటాస్‌’ ఇచ్చిన అనిల్‌.. త్వరలో బాలయ్యకు అలాంటి కథే ఇస్తున్నారని టాక్‌. మరి ఇప్పుడు తారక్‌ చెప్పిన కథ ఎలాంటిది అనేది తెలియాలి. ఏదేమైనా కామెడీ మాత్రం టన్నులు టన్నులు కచ్చితంగా ఉంటుంది. సో చెప్పండమ్మా ఫ్యాన్స్‌… సినిమా ఎలా ఉండొచ్చు, ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టొచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus