కరోనా కాలం నుంచి ఓటీటీల డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఎలాంటి కంటెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోగలమా..? అని రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. కంటెంట్ క్రియేటివ్ గా ఉండాలని సదరు డిజిటల్ కంపెనీ ఏం చేయాలో అన్నీ చేస్తున్నాయి. తక్కువ గ్యాప్ లో కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. టాక్ షోలు,క్రికెట్ మ్యాచ్ లైవ్ లు, ఇంటర్వ్యూలు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా అన్నింటినీ టెలికాస్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీ వెడ్డింగ్స్ ను లక్ష్యంగా మార్చుకుంటున్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి వేడుకకు నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం చెల్లించి హక్కులు కొనుగోలు చేసుకుంది. దీనికి సంబంధించిన చిన్న టీజర్ కూడా వచ్చింది. కానీ పెళ్లిని మాత్రం ఇప్పటివరకు టెలికాస్ట్ చేయలేదు. ఇప్పుడు నయన్ దంపతులు తమ ట్విన్స్ తో సంతోషంగా ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లిని కూడా ఓటీటీలో టెలికాస్ట్ చేయబోతున్నారు.
నటి హన్సిక త్వరలోనే తన ప్రియుడు సోహైల్ కతూరియాని వివాహం చేసుకోబోతుంది. డిసెంబర్ 3,4 తేదీల్లో ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లిని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేటు పెట్టి రైట్స్ కొనుక్కుందట. హన్సిక ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.
ఆమెకి గుడికట్టే రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అందుకే కచ్చితంగా ఆమె పెళ్లికి భారీ వ్యూస్ వస్తాయని భావించి ఇలా సెట్ చేసుకున్నారు. ఈ ఓటీటీ డీల్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇండస్ట్రీలో పెళ్లి కాని హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందరూ ఓటీటీలతో డీల్ కుదుర్చుకుంటే ఇదొక ట్రెండ్ అవ్వడం ఖాయం.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!