నిహారిక నిశ్చితార్ధం అయిన వెంటనే వరుణ్ కూడా రెడీ అయిపోతున్నాడట..!

లాక్ డౌన్ నియమాలను పాటిస్తూనే సినీ తారలు పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్నారు. నిఖిల్ ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడు, నితిన్ పెళ్లి కూడా మరో రెండు రోజుల్లో జరుగబోతోంది. ఇక మెగా డాటర్ నిహారిక కూడా పెళ్లికి రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డ అనే సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తో నిహారిక పెళ్లి జరుగబోతోంది. ఆగష్టులోనే ఎంగేజ్మెంట్ జరుగబోతోంది. ఇక తన చెల్లి పెళ్లి జరిగిన వెంటనే.. వరుణ్ తేజ్ కూడా రింగ్ లోకి దిగబోతున్నాడట.

అంటే వరుణ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడా అని ఆశ్చర్యపోకండి. వరుణ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు అంతే. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్ తేజ్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయ్యింది. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ వైరస్ మహమ్మారి మరింత విజృంభిస్తున్న తరుణంలో చాలా మంది హీరోలు షూటింగ్ లకు రెడీ అవ్వడం లేదు.

ఈ క్రమంలో వరుణ్ మాత్రం తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కు రెడీ అయిపోతున్నాడట. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. వైజాగ్ లో నెక్స్ట్ షెడ్యూల్ జరుగబోతుందట. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.

1

2

3

4

5

6

7

8

9

10


Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus