RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ టార్గెట్ చేసిందా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమాకు హిందీలో పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఈగ బాలీవుడ్ లో భారీస్థాయిలో సక్సెస్ కాలేదు. మక్కీ పేరుతో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. బాహుబలి ది బిగినింగ్ కూడా పెద్దగా అంచనాలు లేకుండానే హిందీలో విడుదల కావడం గమనార్హం. అయితే రిలీజైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో బాలీవుడ్ లో బాహుబలి1 కు ప్లస్ అయింది.

Click Here To Watch NEW Trailer

బాహుబలి1 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాహుబలి2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కట్టప్ప ఫ్యాక్టర్ కూడా బాహుబలి2 సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడటానికి కారణమైందని చెప్పవచ్చు. బాహుబలి2 బాలీవుడ్ లో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను మించి బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సాహో హిందీలో రికార్డులు క్రియేట్ చేసింది.

పుష్ప ది రైజ్ హిందీలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించింది. అయితే పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ మీడియా టాలీవుడ్ పెద్ద సినిమాలను టార్గెట్ చేస్తోంది. మార్చి 11వ తేదీన హిందీలో భారీస్థాయిలో విడుదలైన రాధేశ్యామ్ సినిమాకు బాలీవుడ్ మీడియా నెగిటివ్ గా రివ్యూలు ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానున్నా ఈ సినిమాకు నేషనల్ మీడియాలో ఎక్కువగా ప్రాధాన్యత దక్కడం లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రమే నార్త్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ హవా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. బాలీవుడ్ మీడియా హిందీ సినిమాల విషయంలో ఒక విధంగా తెలుగు సినిమాల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ మీడియా టార్గెట్ చేస్తున్నా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటాలని చరణ్, తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus