Rajamouli: అది ప్లాప్ అవ్వడంతో ఆ స్టార్ డైరెక్టర్ కొడుకుతో రాజమౌళి సినిమా క్యాన్సిల్ అయ్యిందట..!

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఏ మూవీ చేసినా జనాలు ఎగబడి చూస్తారు. ఆయనకి స్టార్ హీరోలతో పనిలేదు అనడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఇమేజ్ కు రాజమౌళి ఇమేజ్ యాడ్ అయితే ఔట్పుట్ పీక్స్ లో ఉంటుంది అనడం కరెక్ట్. రాజమౌళి వల్ల స్టార్లు అయిన హీరోలతోనే ఇప్పటివరకు రాజమౌళి పనిచేస్తూ వచ్చాడు. కానీ ఆల్రెడీ స్టార్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళతో ఆయన సినిమాలు చేసింది లేదు. సరే ఇప్పుడంటే రాజమౌళితో సినిమా చేయడానికి ఏ హీరో అయినా రెడీగా ఉంటాడు.

Click Here To Watch NEW Trailer

కానీ ఒకప్పుడు రాజమౌళికి ఛాన్స్ లు ఇచ్చినవాళ్ళు ఎవరు? బాలకృష్ణకి కథ చెబితే సినిమా ఛాన్స్ ఇవ్వలేదని స్వయంగా బాలయ్యే ఒప్పుకున్నాడు. ఆయన వద్దకి వెళ్ళి రెండు, మూడు కథలు చెప్పినా రాజమౌళి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి తీసిన మొదటి సినిమా తర్వాత ఆయన ఇమేజ్ మారిందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. ఎందుకంటే ‘స్టూడెంట్ నెం’ మూవీ హిట్ అయినా దాని క్రెడిట్ మొత్తం రాఘవేంద్ర రావు గారి అకౌంట్లో పడిపోయింది.

అలాంటి టైములో మళ్ళీ రాఘవేంద్ర రావు గారే రాజమౌళికి ఛాన్స్ ఇచ్చారు. ఆయన కొడుకు సూర్య ప్రకాష్ ను హీరోగా పెట్టి రాజమౌళి ఓ సినిమా చేయాలి. స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం అనుకున్న టైములో ఆ సినిమా ఆగిపోయింది. దానికి కారణం అనుకున్న దానికంటే బడ్జెట్ లెక్కలు పెరిగిపోవడమే. దాంతో రాజమౌళి- సూర్య ప్రకాష్ ల మూవీ మధ్యలోనే ఆగిపోయింది.

తర్వాత మోహన్ లాల్ తో ఓ మైథలాజికల్ మూవీని అనుకున్నాడు రాజమౌళి. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ నిర్మాతలు ఓ దర్శకుడితో సినిమా మొదలుపెట్టారు.సగం షూటింగ్ అయ్యాక ఆ మూవీ ఆగిపోయింది. ఆ దర్శకుడి ప్లేస్ లో రాజమౌళికి అవకాశం దొరికింది. అలా ‘సింహాద్రి’ రూపొందింది. దాని రిజల్ట్ ఏంటి.. తర్వాత రాజమౌళి గ్రాఫ్ ఎలా పెరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus