అజ్ఞాతవాసితో పాఠాలు నేర్చుకున్న కొరటాల!

మనకి జరిగిన అనుభవంతోనే అన్ని నేర్చుకోవాలంటే జీవితం సరిపోదు. ఇతరులకు జరిగిన ఇబ్బందుల నుంచి కూడా మనం పాఠాన్ని నేర్చుకోవాలి. అదే విధంగా కొరటాల శివ అజ్ఞాతవాసి సినిమా ఫలితంతో జాగ్రత్త పడుతున్నారు. అసలు విషయంలోకి వెళితే…  అజ్ఞాతవాసి కథ ఫ్రెంచ్ మూవీ నుంచి తీసుకున్నదని మొదటి నుంచి గాసిప్స్ షికారు చేస్తుండేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత రూమర్ నిజమైంది. ఆ చిత్ర డైరక్టర్ తన కథని కాపీ కొట్టారని ట్విట్టర్ వేదికపై రచ్చ చేశారు. ఈ దెబ్బకి త్రివిక్రమ్ శ్రీనివాస్ పరువు పోయింది. అలాంటి అనుభవం తనకి ఎదురవకుండా ఉండాలని కొరటాల భావిస్తున్నారు. మైకేల్ డగ్లస్ అనే హాలీవుడ్ చిత్రానికి భరత్ అనే నేను ఫ్రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి.

శ్రీమంతుడు సినిమాతో పాటు.. ఈ సినిమాని కాపీ కథతో తెరకెక్కిస్తున్నారని టాక్ మొదలైంది. దీంతో మేల్కొన్న కొరటాల శివ.. భరత్ అనే నేను సినిమాలో కాపీ అనిపించే సన్నివేశాలను తొలిగించేసినట్లు తెలిసింది. ఆ స్థానంలో కొత్త సీన్లు రాసుకొని రీ షూట్ చేయనున్నారు. ప్రస్తుతం భరత్ అను నేను క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక రెండు పాటలు మాత్రమే మిగిలి ఉండేవి. ఇప్పుడు కొత్తగా కొన్ని సీన్లు తీయాల్సి వచ్చింది. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య  నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న భరత్ అనే నేను ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus