కరోనా సెకండ్ వేవ్ తో ఓటీటీ మార్కెట్ కు మరింత బలం చేకూరింది. జనాలు సినిమాల కంటే కూడా ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. స్టార్ క్యాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ బావుంటే వెబ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ దక్కుతోంది. మొన్న వచ్చిన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ – నిన్న వచ్చిన సినిమా బండి మంచి రిజల్ట్ ను అందుకున్నాయి.
ఇక అగ్ర దర్శకులు రచయితలు సైతం వెబ్ కంటెంట్ రెడీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆహా యాప్ అందుకోసం ఒక ప్లాన్ కూడా వేసింది. ఓకేసారి వంశీ పైడిపల్లి, మారుతి, నందిని రెడ్డి వంటి టాలంటేడ్ దర్శకుల చేత విభిన్నమైన కాన్సెప్ట్ లను రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని బలమైన స్క్రిప్టులు కుడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇక ఆ దర్శకులతో పాటు సుకుమార్ రైటింగ్స్ నుంచి కూడా విభిన్నమైన కథలు రాబోతున్నాయట.
దర్శకుడు సుకుమార్ తన శిష్యులను ఓటీటీ ప్రపంచం వైపు కూడా అడుగులు వేయించబోతున్నట్లు సమాచారం. గతంలోనే అల్లు అరవింద్ తో ఈ విషయంపై చర్చలు కూడా జరిపినట్లు టాక్ వస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా రెండు ఎనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఆ కొత్త కాన్సెప్ట్ లు ఆహా యాప్ కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.