ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలన్నీ స్పెషల్ గా ఓ బ్యానర్ ను మొదలుపెట్టి అందులో తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీయడం మొదలుపెట్టారు. యూవీ క్రియేషన్ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ పేరుతో చిన్న సినిమాలు తీస్తుంది. తాజాగా ఈ సంస్థ మారుతితో కలిసి ఓ చిన్న సినిమా తీసింది. అదే ‘మంచి రోజులు వచ్చాయి’. మూడున్నర కోట్లతో తీసిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ‘ఆహా’ ఓటీటీ సంస్థకు అమ్మేసింది.
అయితే ఈ ఒక్క సినిమానే కాదు.. దీంతో పాటు యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న మరో రెండు, మూడు సినిమాలు కలిపి మొత్తం ఒకేసారి బల్క్ గా అమ్మేశారట. యూవీ సంస్థ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్’, అలానే సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న మరో చిన్న సినిమా, మహి దర్శకత్వంలో చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా.. ఇలా అన్నీ కలిపి డిజిటల్ హక్కులను ‘ఆహా’కు అమ్మేశారు.
మొత్తానికి ఈ సినిమాలన్నింటినీ ‘ఆహా’ రూ.17 కోట్లకు సొంతం చేసుకుందని అంటున్నారు. కొందరు మాత్రం ఈ సినిమా హక్కులకు ‘ఆహా’ పదమూడు కోట్లే చెల్లించిందనిచెబుతున్నారు . ఏదేమైనా.. కొత్త సినిమాలను దక్కించుకోవడం ఆహా ముందుంటుంది. ఫ్యూచర్ లో ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో భారీ బడ్జెట్ సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!