Hello June Trailer: ‘ఆహా’ లో విడుదల కాబోతున్న మరో వైవిధ్యమైన మూవీ ‘హలో జూన్’..!

‘ఆహా’ ఓటిటి వారు ప్రతీ శుక్రవారం ఓ కొత్త సినిమాని ప్రేక్షకులకు అందించి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. గత వారం పవన్ కళ్యాణ్-రానా ల మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ ను హై క్వాలిటీ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ప్రశంసలు అందుకున్నారు. ఈ వారం ‘హలో జూన్’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ శుక్రవారం నాడు అంటే ఏప్రిల్ 1 నుండీ ‘హలో జూన్’ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Click Here To Watch NOW

మలయాళంలో విజయం సాధించిన ఈ మూవీని డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రజిత విజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో సర్జానో ఖలీద్, అర్జున్ అశోకన్, జోజు జార్జ్, అశ్వత్ మీనన్, సన్నీ వేన్, అజు వర్గీస్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. అహ్మద్ కబీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొద్దిసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించి ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఇక ఈ చిత్రం ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఇది ఒక అమ్మాయి లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీకి సంబంధించిన కథ అని తెలుస్తుంది. టీనేజ్ లోకి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలా మారింది.. ఈమె ప్రేమించింది ఎవర్ని? ఈమె ప్రేమకు ఎదురైన సమస్య ఏంటి? అనే అనుమానాలను క్రియేట్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేసారు. యూత్ అండ్ ఫ్యామిలీస్ ను ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా ఈ మూవీలో ఉన్నట్టు స్పష్టమవుతుంది.

‘యాంట్స్ టు ఎలిఫెంట్స్’ బ్యానర్ పై అనిల్ కె రెడ్డి, జయప్రకాష్ వి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus