Ahimsa Collections: ‘అహింస’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు, సురేష్ బాబు చిన్న కొడుకు అయిన అభిరామ్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం ‘అహింస’. ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గీతికా తివారి హీరోయిన్. జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. హీరోయిన్ పై అత్యాచారం చేసిన ఊరి పెద్ద కొడుకులపై అహింసాత్మకంగా న్యాయ పోరాటం చేయాలనుకుంటాడు హీరో.

అతను అహింస పోరాటం ప్రేక్షకులకి నచ్చలేదు. పైగా మితిమీరిన వయొలెన్స్ కూడా జనాలకి ఇరిటేషన్ తెప్పించింది. అభిరామ్ కు ఈ మూవీ సరైన డెబ్యూ కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ ఫైనల్ గా జూన్ 2 కి వచ్చి పడింది.

ఇక బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. (Ahimsa) ‘అహింస’ చిత్రాన్ని చాలా వరకు సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నట్లు ట్రేడ్ పండితుల సమాచారం. అయినప్పటికీ మెయింటెనెన్స్ లు, రెంట్లు.. వంటివి రికవరీ అవ్వాలి అంటే రూ.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.24 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో ఈ మూవీని డిజాస్టర్ గా పరిగణించాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus