“మర్మదేశం” అనే తమిళ సినిమాను తెరకెక్కించిన ఎల్.నాగరాజన్ రూపొందించిన వెబ్ సిరీస్ “ఐందం వేదం” (Aindham Vedham) . అయిదవ వేదం అనేది దీని అర్థం. “కబాలి” ఫేమ్ ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఇప్పుడు జీ5 యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా నిర్మించబడిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? వీకెండ్ కి బింజ్ వాచ్ చేయొచ్చా? అనేది చూద్దాం..!!
Aindham Vedham Review in Telugu
కథ: తల్లి అస్తికలు గంగలో కలిపి, ఆమె ఆత్మ శాంతించడం కోసం కర్మలు చేయించి తిరుగు ప్రయాణమవుతుంది అను (సాయి ధన్సిక). అయితే ఆమెకు కాశీ నుంచి బయలుదేరేప్పుడు ఓ స్వామీజీ పిలిచి మరీ ఆమెకు ఓ బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్ ఓ కీలకమైన రహస్యానికి తాళమని, జాగ్రత్తగా ఓ గ్రామానికి చేర్చమని కోరతాడు. కట్ చేస్తే.. ఆ బాక్స్ ఇవ్వడానికి ఆయంగారపురానికి వెళ్లిన అను అక్కడే ఇరుక్కుపోతుంది. అక్కడనుండి ఆమె బయటకు వెళ్ళకుండా ఏవేవో శక్తులు అడ్డుపడుతుంటాయి.
అను మాత్రమే కాక మరింత మంది ఒక్కొక్కరుగా అయంగారపురంలో ఇరుక్కుంటారు. అసలు ఆ ఊర్లో ఏముంది? ఐదవ వేదం ఎక్కడ దాచారు? ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మధ్యలోకి ఎందుకు వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఐందం వేదం” (Aindham Vedham) వెబ్ సిరీస్.
నటీనటుల పనితీరు: సాయి ధన్సిక కీలక పాత్రధారి అయినప్పటికీ, అందరికంటే ఎక్కువగా ఆకట్టుకున్న నటుడు మాత్రం వివేక్ రాజగోపాల్. మిత్రన్ పాత్రలో సిరీస్ కి కాస్త ఫన్ యాడ్ చేశాడు. కృష్ణ కురూప్ మరో కీలకపాత్రలో ఆకట్టుకుంది. దేవదర్శిని లాయర్ పాత్రలో చిన్నపాటి బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. వివేక్ రాజగోపాల్, వై.జి.మహేంద్ర, రాంజీ తదితరులు తమ సీనియారిటీకి తగ్గ పాత్రలో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఎల్.నాగరాజు ఇప్పటికే హాలీవుడ్ లో పదుల సంఖ్యలో వచ్చిన “ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్” బేస్డ్ సినిమాలన్నీ మిక్సీలో వేసి దానికి మైథలాజికల్ టచ్ ఇచ్చి “ఐందం వేదం” కథను రాసుకున్నాడు. నిజానికి తొలి నాలుగు ఎపిసోడ్స్ లో కొంతమేరకు ఆకట్టుకున్నాడు. కానీ.. ఎప్పుడైతే 7వ ఎపిసోడ్ లో ఇదంతా చేస్తుంది AI అని రివీల్ చేస్తాడో సిరీస్ మీద ఆసక్తి పోతుంది.
ఈమాత్రం దానికి మీట్ ప్రొడక్షన్ అనీ, మీట్ ప్రింటింగ్ అనీ పొలోమని క్యారెక్టర్స్ ను సిరీస్ లో ఎందుకు ఇరికించాడో అర్థం కాలేదు. ఉన్నది చాలదన్నట్లు, మళ్లీ రాజుల కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ ను పెట్టడం, అది చూడాలంటే మళ్లీ సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేయాలంటూ ముగించడం అనేది ప్రేక్షకుల ఆసక్తిని పాడుచేస్తుంది. రేవా సంగీతం, శ్రీనివాసన్ సినిమాటోగ్రఫీ వర్క్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ చాలా బేసిక్ లెవెల్ లో ఉన్నాయి.
విశ్లేషణ: ఓ ఆసక్తికరమైన కథ-కథనం రాసుకొని ప్రేక్షకుల్ని అలరించే స్థాయిలో వాటిని నడిపించడం అనేది వెబ్ సిరీస్ ల విషయంలో చాలా కీలకం. లెక్కకు మిక్కిలి అంశాలను జోడించేసి, పస లేని స్క్రీన్ ప్లేతో 8 ఎపిసోడ్ల సిరీస్ నడపడమే కష్టం అనుకుంటే, మళ్లీ సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేయించడం అనేది ఇంకా పెద్ద తప్పు.
ఫోకస్ పాయింట్: సాగతీత కారణంగా అలరించలేకపోయిన “ఐందం వేదం”.
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus