Aishwarya Rai: ఆ విషయంలో మాత్రం ఐశ్వర్యారాయ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే!

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా ఐశ్వర్యారాయ్ కు క్రేజ్ ఉంది. అయితే బాలయ్య కాళ్లకు నమస్కరించడం ద్వారా తాజాగా ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai ) వార్తల్లో నిలిచారు. ఐశ్వర్యారాయ్ బాలయ్యకు (Balakrishna) ఇచ్చిన గౌరవాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అబుదాబిలో ఐఫా అవార్డుల కార్యక్రమం గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాకు ఐశ్వర్యారాయ్ కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ దక్కగా బాలయ్య తన చేతుల మీదుగా ఐశ్వర్యారాయ్ కు అవార్డ్ ఇచ్చారు.

Aishwarya Rai

ఐశ్వర్యారాయ్ బాలయ్య కాళ్లకు నమస్కరించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. ఐశ్వర్యారాయ్ చేసిన పని అమితాబ్ ఫ్యామిలీకి ఉన్న సంస్కారానికి నిదర్శనమని ఈ విషయంలో ఐశ్వర్యారాయ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఐశ్వర్యారాయ్ ఈ వేడుకలో మాట్లాడుతూ నన్ను ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు అని అన్నారు. మణిరత్నం (Mani Ratnam) అంటే నాకు ఎంతో గౌరవమని ఆమె పేర్కొన్నారు.

మణిరత్నం సినిమాలో భాగం కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఐఫా వేదికగా సినీ ప్రముఖులను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఐశ్వర్యారాయ్ పేర్కొన్నారు. ఆరాధ్య సినీ ఎంట్రీ గురించి ఐశ్వర్య స్పందిస్తూ ఆరాధ్య ప్రస్తుతం చదువుకుంటోందని పేర్కొన్నారు. ఆరాధ్య నా కూతురు అని ఎల్లప్పుడూ నాతోనే ఉంటుందని ఐశ్వర్యారాయ్ వెల్లడించారు. ఐశ్వర్యారాయ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్ తర్వాత సినిమాలతో సైతం సక్సెస్ ను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య ఐశ్వర్యారాయ్ కాంబోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఐశ్వర్యారాయ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

దేవరకు ఖుష్బూ రివ్యూ వైరల్.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడంటూ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus