ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) తమిళంలో పాపులర్ అయినా తెలుగు అమ్మాయే. రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’ అనే సినిమాతో ఆమె నట ప్రస్థానం మొదలైంది. తర్వాత ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసింది. హానెస్ట్ హీరోయిన్, హార్డ్ వర్కర్, ప్రామిసింగ్ హీరోయిన్.. వంటి బిరుదులు సంపాదించుకుంది. హీరోయిన్ గా మారిన తర్వాత ఏకంగా 40 సినిమాల్లో నటించింది. అయినా సరైన బ్రేక్ అయితే రాలేదు. అయితే ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఆమెకు మంచి బ్లాక్ బస్టర్ అందించింది.
అంతకు ముందు కూడా ఈమె విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) సినిమాలో కూడా ఈమె నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో ఈమె క్లిక్ అవ్వలేదు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో చేసిన భాగ్యం పాత్ర ఈమెకు అన్ని విధాలుగా కలిసొచ్చినట్టే అని చెప్పాలి. తెలుగులో ఇప్పుడు ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాజేష్ ఓ స్టార్ హీరోపై మనసు పారేసుకుంది.
అతనితో నటించాలనే ఆశ ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అతను మరెవరో కాదు ఎన్టీఆర్ (Jr NTR). ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) నుండి అతన్ని చూస్తున్నాను. అతను ఒక ఆల్ రౌండర్ అనిపిస్తుంది. డాన్స్ బాగా చేస్తాడు, అద్భుతంగా డైలాగులు చెబుతాడు,యాక్టింగ్లో కూడా వేరియేషన్స్ చూపిస్తాడు.
ఎలాంటి పాత్రకైనా పూర్తి న్యాయం చేస్తాడు అనిపిస్తుంది. అతనితో కలిసి నటించే ఛాన్స్ నాకు ఇప్పటివరకు రాలేదు. వస్తే.. అస్సలు వదులుకోను. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.