ఎట్టకేలకి అనుకున్న ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తున్నాడుగా…

ఆర్ ఎక్స్ 100 సినిమాతో బంపర్ హిట్ కొట్టినా కూడా రెండో సినిమాకోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది డైరెక్టర్ అజయ్ భూపతికి. మహాసముద్రం స్క్రిప్ట్ తో చాలామంది హీరోలని అప్రోచ్ అయ్యాడు. కొంతమంది పెద్ద హీరోలు కూడా స్క్రిప్ట్ విని బాగుంది చేద్దాం అని కమిట్ అయ్యారు కూడా. కానీ, డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడమో, లేదా స్టోరీలో మార్పులు చెప్పడం వల్లో ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఎట్టకేలకి శర్వానంద్ ఇంకా సిద్ధార్ధ్ లతో కలిసి ఈ మహాసముద్రాన్ని తెరెకెక్కిస్తున్నాడు మనోడు.

ఇప్పుడు ఈసినిమాలో స్నేహం అంటే ఏంటో తెలిపే పాట ఉండబోతోందని, మరోసారి ముస్తఫా ముస్తఫా సాంగ్ ని ఆడియన్స్ కి గుర్తుండేలా చేస్తుందని టాక్ వినిపిస్తోంది. చేతన్ భరద్వాజ్ అందించే ఈ పాట మనసుకి హత్తుకునేలా ఉండబోతోందట. రీసంట్ గా చేతన్ ఇచ్చిన ఎస్ ఆర్ కళ్యాణమండపంలో చూశాలే కళ్లారా అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో ఈసాంగ్ ఇప్పటికే 37 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది.

అలాంటి హిట్ పాటలాగానే త్వరలో మహాసముద్రం నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాని తను అనుకున్నట్లుగానే తెరకెక్కిస్తూ తెలుగు , తమిళ మార్కెట్స్ ని గ్రాబ్ చేసేందుకు చూస్తున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మరి ఈ మహాసముద్రం సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడు అనేది ఆసక్తికరం. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus