బాహుబలిలో నా సీన్స్ తీసేసారు : అజయ్ ఘోష్

  • August 3, 2018 / 10:08 AM IST

తమిళ నటుడు అజయ్‌ ఘోష్‌ “జ్యోతిలక్ష్మి”లో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రీసెంట్ గా రంగస్థలం సినిమాలోనూ నెగటివ్ క్యారెక్టర్ లో మెప్పించారు. ఎన్నో అవార్డులు అందుకున్న ఇతను రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా నిడివి పెరిగిందని తాను నటించిన సన్నివేశాలను తొలగించారని వెల్లడించారు. అదికూడా బాహుబలి వంటి సినిమా కోసం పనిచేసి కూడా క్రెడిట్ దక్కకపోవడం ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ తాను మాత్రం ఫీల్ కాలేదని వెల్లడించారు.

ఆ విషయం గురించి వివరిస్తూ.. “నేను ‘బాహుబలి’ సినిమా చేశాను.. ఆ విషయం కొంతమందికి చెప్పాను.. వాళ్ల ద్వారా చాలామందికి తెలిసింది. ఆ సినిమాలో నేను చేసిన సీన్స్ ను నిడివి పెరిగిన కారణంగా తీసేశారు .. దానికి నేనేమీ ఫీల్ కాలేదు. కానీ అందరూ ‘బాహుబలి’ చేశానని చెప్పావు కదా .. ఎక్కడా కనిపించలేదు ..’ అని అడగడం మొదలు పెట్టారు. ‘ఆ సీన్స్ ను తీసేశారు’ అని వాళ్లకి నేను చెప్పుకుంటూ రావలసి వచ్చింది. ‘అబ్బా .. భలే ఛాన్స్ పోయింది’ అంటూ అవతలవాళ్లు ఫీలయ్యే వాళ్లు .. నిడివి ఎక్కువైతే కొన్ని సీన్స్ ను లేపేస్తారనే సంగతి వాళ్లకి తెలియదు కదా” అంటూ చెప్పుకొచ్చారు. అతని సీన్స్ కూడా ఉంటే బాహుబలి ఇంకెంత బాగుండేదోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus