వైరల్‌: అజిత్‌ బైక్‌ స్టంట్స్‌ చూశారా?

అజిత్‌కి ధైర్యం ఎక్కువ. ఈ మాట ఆయన ఎంచుకున్న కథలు చూశారో, సినిమాల్లో ఆయన చూపించే హీరోయిజం చూశో అన్న మాట కాదు. సినిమా కోసం ఆయన ఎంతకైనా తెగించే తత్వం చూసి అన్నమాట. గతంలో చాలా సార్లు అజిత్‌ తనకు సినిమా అంతే ఎంత ఇష్టమో, ప్రేమో చూపించారు. అదేదో కావాలని కాదు. ఆయన సినిమాల్లో చేసే రిస్కీ స్టంట్లు, ఎవరి వల్లా కాని ఫీట్‌లతో. ఇప్పుడు మరోసారి ‘వలిమై’ కోసం అదే పని చేశారు.

హెచ్‌. వినోథ్‌ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్న చిత్రం ‘వలిమై.’ టాలీవుడ్‌ కుర్ర హీరో కార్తికేయ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కరోనా పరిస్థితులకు ముందు మొదలైన ఈ సినిమా చిత్రీకరణ… అన్ని సినిమాల్లాగే ఆగిపోయింది. దీంతో అందరిలాగే ‘వలిమై’ టీమ్‌ ఆలోచనల్లో మునిగిపోయింది. అయితే తిరిగి షూటింగ్స్‌ మొదలవ్వగానే తమదైన ఉత్సాహంతో ముందుకుసాగారు. ఇవన్నీ వివరిస్తూ చిత్రబృందం ఓ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో అజిత్‌ టీమ్‌ చేసిన బైక్‌ స్టంట్స్‌ అదిరిపోయాయి.

ఇక మేకింగ్‌ వీడియో ఆఖరులో ఊహించని పరిణామాన్ని చూపించారు. బైక్‌ స్టంట్‌ చేస్తున్నప్పుడు పట్టు తప్పి అజిత్‌ బండి మీద నుండి రోడ్డుపైన పడిపోయాడు. దీంతో అందరూ కంగారు పడి దగ్గరకు వెళ్లబోగా… అజిత్‌ ఎంచక్కా లేచి మళ్లీ షూట్‌కి రెడీ అయిపోయాడు. దీన్ని చూసి చిత్రబృందం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. దాని తర్వాత అజిత్‌ను ఇందుకే గ్రేట్‌ అంటారు అని మరోసారి గుర్తు చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేస్తున్నారు. అన్నట్లు దిగువ వీడియోలో మీరూ ఆ ఫీట్‌ చూడొచ్చు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!


మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus