Ajith: కేజీఎఫ్3 సినిమాలో హీరోగా అజిత్ అంటూ వార్తలు.. ఊహించలేదంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్2 (Salaar) , ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలలో ప్రశాంత్ నీల్ మొదట ఏ సినిమాను మొదలుపెడతారనే చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ (KGF) యూనివర్స్ లోకి హీరో అజిత్ (Ajith) ఎంట్రీ ఇస్తారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్3 కంటే ముందే అజిత్, నీల్ కాంబో మూవీ అంటూ ఒక వార్త వైరల్ అవుతుంటే కేజీఎఫ్3 సినిమాలో అజిత్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రశాంత్ నీల్ నుంచి స్పష్టత వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. 2026 సంవత్సరంలో అజిల్ నీల్ కాంబో మూవీ రిలీజ్ కానుందని భోగట్టా. ప్రశాంత్ నీల్ కెరీర్ ఒకింత గందరగోళంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అజిత్ ప్రస్తుతం విదామయూర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

ప్రశాంత్ నీల్ అభిమానులు మాత్రం వైరల్ అవుతున్న వార్తలను నమ్మడం లేదు. ప్రశాంత్ నీల్ త్వరలో మీడియా ముందుకు వస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ప్రశాంత్ నీల్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడానికి మరో ఆరు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అజిత్, ప్రశాంత్ నీల్ కాంబోను ఊహించలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus