Ajith: రెండు ప్రొడక్షన్‌ హౌస్‌లకి మైత్రి షాక్‌… అజిత్‌ సినిమా కొత్త డేట్‌తో!

సినిమా రిలీజ్‌ డేట్ ముందే చెప్పేసి లాక్‌ చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. దాంతోపాటు ఆ టైమ్‌ వరకు వచ్చిన వెనక్కి తగ్గడమూ ఎక్కువైపోయింది. దీంతో ఎందుకు చెప్పడం, ఎందుకు రాకపోవడం అనే చిన్న విసుగు ప్రేక్షకుల్లో ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది. అంతేకాదు ఇలా వాయిదాలు వేయడం వల్ల ఇతర సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌లకు కూడా చిరాకు వస్తోంది. దీంతో ఎత్తుకు పై ఎత్తు అనే కాన్సెప్ట్‌ కూడా జరుగుతోంది.

Ajith

ఈ లెక్కలన్నీ కలిపి చూసుకుంటే ఈ ఏడాది సమ్మర్‌లో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతోంది అని అంటున్నారు. ఒక ప్రొడక్షన్‌ హౌస్‌కి కాదు ఇద్దరికి దెబ్బేసే పనిలో ఉన్నారు మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌లో తెరకెక్కుతున్న అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాను ఏప్రిల్‌ 10న తీసుకొస్తామని టీమ్‌ అనౌన్స్‌ చేసింది. అందులో ఇబ్బందేముంది అనుకుంటున్నారా? వాళ్లు చెబుతున్నది ‘ఏప్రిల్‌ 10’.

ఆ డేట్‌కి టాలీవుడ్‌ నుండి ఓ పాన్‌ ఇండియా సినిమా రాబోతోంది. అదే ప్రభాస్ (Prabhas) – మారుతి (Maruthi Dasari) ‘ది రాజాసాబ్‌’(The Rajasaab) . చాలా రోజులుగా సెట్స్‌ మీద ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేస్తామని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ చేసింది. కానీ ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ అజిత్‌ సినిమా కోసం ఆ డేట్‌ను ఎంచుకుంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే డేట్‌నా వస్తాయా? అసలు సాధ్యమేనా? వస్తే నష్టమా? అనే చర్చ మొదలైంది. అజిత్‌ (Ajith) వస్తే ప్రభాస్‌ తప్పుకోవాలా అనే డిస్కషన్ నడుస్తోంది.

అయితే, కొంతమంది మాత్రం ఇప్పటికే ఆ డేట్‌ నుండి ‘రాజా సాబ్‌’ తప్పుకున్నాడని, అందుకే ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తీసుకొస్తున్నారు అని అంటున్నారు. అంతేకాదు ఇలా డేట్‌ అనౌన్స్‌ చేసి ‘విదామయూర్చి’ (Vidaamuyarchi)  నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కి కూడా మైత్రీ వాళ్లు షాక్‌ ఇచ్చారు అని అంటున్నారు. సంక్రాంతికి తమ సినిమా తీసుకొద్దామనుకున్న మైత్రీకి లైకా షాకిచ్చిన విషయం తెలిసిందే. చూద్దాం ఆ డేట్‌ వచ్చేసరికి ఏం జరుగుతుందో?

అనిల్ రావిపూడి లిస్టులో మరో సీనియర్ హీరో.. సెట్టయితే డబుల్ యాక్షన్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus