Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • December 2, 2023 / 11:43 AM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోల రెమ్యునరేషన్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోలు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తమిళంలో రజనీకాంత్, విజయ్ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా అజిత్ కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారని సమాచారం అందుతోంది. అజిత్ కు మైత్రీ నిర్మాతలు ఏకంగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అజిత్ (Ajith) ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. మైత్రీ నిర్మాతలు గత ఎనిమిది సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతుండగా ఇకపై తమిళంలో సైతం వరుస సినిమాలను నిర్మించగా మైత్రీ నిర్మాతలు అడుగులు వేస్తున్నారు.

మైత్రీ నిర్మాతలు తమిళ ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటుతారేమో చూడాలి. ఈ నిర్మాతలు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తూ మైత్రీ నిర్మాతలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు మైత్రీ నిర్మాతల స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మైత్రీ బ్యానర్ లో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ తెరకెక్కుతోంది.

ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. మైత్రీ నిర్మాతలకు గత సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించాయని సమాచారం అందుతోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఈ బ్యానర్ రేంజ్ ను మరింత పెంచాయి. ఖుషి సినిమా కూడా మైత్రీ నిర్మాతలకు లాభాలను మిగిల్చింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags