Ajith: అజిత్ రెమ్యునరేషన్ రూల్స్.. ప్రతీ నెల వేయాల్సిందేనా?

తమిళనాట మాస్ ఇమేజ్‌కి బ్రాండ్‌గా నిలిచిన అజిత్ కుమార్ (Ajith Kumar)   ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) మూవీతో మరోసారి తన క్రేజ్‌ను నిరూపించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం విజయంతో పాటు, ఇప్పుడు అజిత్ రెమ్యునరేషన్ వ్యవహారం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ విషయంలో ఆయన తీసుకుంటున్న స్టాండ్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, అజిత్ ఈ సినిమాకు రూ.165 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Ajith

అయితే అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన విధానం. అజిత్ నిర్ణయించిన నియమాలు ‘నెవ్వర్ బిఫోర్’ రూల్స్‌గా నిలుస్తున్నాయంటున్నారు. ముందుగా 10 శాతం అడ్వాన్స్ తీసుకున్న అజిత్, మిగిలిన మొత్తం ప్రతీ నెల 5వ తేదీన ఖచ్చితంగా తన అకౌంట్లో ఉండాలని కండిషన్ పెట్టారట. ఒకవేళ ఆ రోజు సెలవు అయితే, దానికంటే ముందు రోజే చెల్లించాలన్న నిబంధనతో నిర్మాతలు కాస్త ఒత్తిడిలో పడ్డట్టు సమాచారం. ఇది ఏదో వాయిదా చెల్లింపు కాదని..

ఇది తుది వరకు అమలు కావలసిన డీలే అని అజిత్ టీమ్ క్లారిటీ ఇచ్చిందట. షూటింగ్ ముగిసినా.. వాయిదా కట్టేవిధంగా కాకుండా.. నెలవారీగా చెల్లించాల్సిందేనట. ఈ విధానం నిర్మాణ సంస్థలకు కాస్త కష్టంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ అజిత్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెనుక కొన్ని వ్యూహాత్మక అంశాలున్నాయని అంటున్నారు. ఆదాయాన్ని పూర్తిగా వైట్‌లో ఉంచే ఉద్దేశంతో పాటు, డబ్బుల లాగింపు విషయంలో పారదర్శకత, బాధ్యతతో వ్యవహరించాలనే మెసేజ్ ఇవ్వాలనుకున్నారట.

అలాగే నిర్మాతల నుంచి అనవసర ఒత్తిళ్లు, షెడ్యూల్ మార్పులు ఎదురవకుండా ఉండాలన్న కోణంలోనూ ఈ తీర్మానం తీసుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి అజిత్ నిర్ణయించిన ఈ రెమ్యూనరేషన్ విధానం ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కి గురి చేస్తోంది. ఇది భవిష్యత్తులో ఇతర స్టార్ హీరోలు కూడా అనుసరించబోయే నమూనా అవుతుందా? లేక నిర్మాతలకు భారంగా మారి తిరస్కరించబడుతుందా? అన్నది ఆసక్తికర అంశంగా మారింది.

జైలర్ 2 తెలుగు రైట్స్.. ఇది మరీ టూ మచ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus