Ajith: ‘తునివు’ సినిమా తెలుగు టైటిల్ ఇదే!

కోలీవుడ్ స్టార్స్ లో ఒకరైన అజిత్ చివరిగా ‘వలిమై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇదే టైటిల్ తో తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేశారు. ఆ సమయంలో కాస్త ట్రోలింగ్ జరిగింది. తెలుగులో రిలీజ్ చేసేప్పుడు తెలుగు టైటిల్ పెట్టి ఉంటే కనీసం సినిమా జనాలకు రీచ్ అయి ఉండేదంటూ కామెంట్స్ వచ్చాయి. తెలుగులో టైటిల్ పెట్టకుండా తెలుగు భాషను అవమానిస్తున్నారంటూ ట్రోలింగ్ చేశారు. తెలుగు వారికి అర్ధం కాని పదాలను టైటిల్ గా పెట్టి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపించాయి.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన కార్తికేయను టైటిల్ గురించి ప్రశ్నించినప్పుడు అర్ధం లేని వివరణ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు అజిత్ కొత్త సినిమా ‘తునివు’ని కూడా తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతికి తెలుగులో భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పోటీగా అజిత్ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. చిరు, బాలయ్య సినిమాల మధ్య ‘తునివు’ సినిమాకి చిన్న రిలీజే దక్కుతుంది. అయినప్పటికీ తెలుగు మార్కెట్ ను లైట్ తీసుకోకుండా ‘తునివు’ని రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈసారి ‘వలిమై’ విషయంలో చేసిన తప్పు రిపీట్ చేయకుండా సినిమాకి తెలుగు టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ‘తునివు’ అనే తెలుగులో ధైర్యం అని అర్ధం. ఆ టైటిల్ తో తెలుగులో ఆల్రెడీ ఒక సినిమా ఉంది. అందుకే ‘తెగింపు’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయబోతున్నారట.

ఏదైతేనేం ‘వలిమై’లాగా తమిళ టైటిల్ తో సినిమాను రిలీజ్ చేసి మనవాళ్లకు కోపం రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను కేవలం మూడు కోట్లకు అమ్మేశారు. త్వరలోనే తెలుగు టైటిల్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus