సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ తరువాత తెలుగులో పట్టు సాధించడానికి చాలా మంది తమిళ స్టార్స్ ప్రయత్నించారు. సూర్య, కార్తి, విక్రమ్ ఇలా కొంతమందికి ఇక్కడ క్రేజ్ వచ్చింది. వీరి తరువాత విజయ్ కూడా ఆ లిస్ట్ లో చేరారు. అయితే అజిత్ మాత్రం ఈ రేసులో కనిపించడం లేదు. అజిత్ అంటే తమిళ జనాలకు విపరీతమైన అభిమానం. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే హడావిడి మాములుగా ఉండదు.
తెలుగు ప్రేక్షకులు కూడా అజిత్ ను ఇష్టపడతారు. కానీ ఆయన మాత్రం తెలుగుపై పెద్దగా శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపించరు. దీన్ని రుజువు చేసే సంఘటనలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ గా అజిత్ ‘తునివు’ దీనికి నిదర్శనం. ఈ సినిమా సంక్రాంతికి తమిళంలో విడుదలవుతోంది. నిన్నటివరకు తెలుగు వెర్షన్ కి సంబంధించి ఎలాంటి అలికిడి లేదు. ఇప్పుడు సడెన్ గా రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగు హక్కులను తీసుకుంది.
అది కూడా రూ.3 కోట్లకే అని సమాచారం. మూడు కోట్లు అంటే బయ్యర్లకు వర్కవుట్ అయ్యే రేటే. రేటు మాట పక్కన పెడితే అసలు ‘తునివు’ బరిలో ఉందని ప్రచారమే లేదు. అజిత్ ప్రమోషన్స్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించరు. ఆయన గత సినిమాల విషయంలో కూడా ఇదే జరిగింది. కనీసం తెలుగు టైటిల్ పెట్టాలనే ఆలోచన కూడా ఉండదు.
‘వలిమై’ సినిమాను అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేసేశారు. సరైన ప్రమోషన్స్ కూడా చేయలేదు. దీని వలన సినిమా జనాలకు రీచ్ అవ్వలేకపోయింది. కోలీవుడ్ లో అయితే బాగానే ఆడింది. ఇప్పుడు ‘తునివు’ సినిమాకైనా తెలుగు టైటిల్ పెట్టి కాస్త ప్రమోషన్స్ కల్పిస్తారో లేక ఎప్పటిలానే లైట్ తీసుకుంటారో చూడాలి!
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!