Akash Puri: నాన్న కోసం ఇల్లు విడిచి వచ్చేసింది..పూరి- ఛార్మి ల పై ఆకాష్ కామెంట్స్..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… హీరోయిన్ ఛార్మీ ల సత్సంబంధాలు ఏంటి? అనే విషయం పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్లో కృష్ణ- విజయ నిర్మల తర్వాత అంత అన్యోన్యంగా తిరిగేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు… చేస్తూనే ఉన్నారు. పూరి- ఛార్మీ కలిసి ‘పిసి కనెక్ట్స్’ అనే బ్యానర్ పై సినిమాలు నిర్మించడమే ఈ వార్తలకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇవి ముదిరి ముదిరి మొన్నామధ్య ఛార్మి కోసం కోసం పూరి తన భార్యకి విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

తాజాగా ఈ రూమర్స్ పై ఆకాష్ పూరి స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఆకాష్ పూరి మాట్లాడుతూ.. “నాన్న తన సినీకెరీర్‌లో చాలా నష్టపోయాడు. చాలా పోగొట్టుకున్నాడు. ఈ విషయాలు మాకు తెలియకూడదు అని మా అమ్మ నన్ను.. మా చెల్లిని హాస్టల్‌ కు పంపించింది. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్నా. మేమేమో.. మా నాన్న పెద్ద డైరెక్టర్‌, అంతా హ్యాపీ అనుకున్నాం. కొన్నాళ్ల తర్వాత మాకు అసలు విషయం అర్థమైంది. మేము వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్‌ వరకు, ఉంటున్న ప్లేస్‌ అంతా మారిపోయింది.

మేము ఉన్న ఇల్లు, కార్లు కూడా అమ్మేశాం. ఐదారేళ్లు నరకం చూశాం. కానీ మా నాన్న మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడిలా ఉందంటే కారణం అమ్మే.మా అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్తలు నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్‌ మా అమ్మే. వాళ్లది లవ్‌ మ్యారేజ్‌. కొందరు టైంపాస్‌ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అది నిజం కాదు.

ఇక్కడ మీకో నిజం చెప్పాలి.. మా పేరెంట్స్‌ లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది మా అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రత్యేకంగా అడిగారట నాన్న. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించే వాళ్ళు నిజంగా ఉంటారా? అనిపించింది’ అంటూ తెలిపాడు ఆకాశ్‌. అలాగే పూరి – ఛార్మి ల ప్రస్తావన వచ్చే ముందే మిగిలినవన్నీ ఫేక్ అని చెప్పేశాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus