ఆర్థిక లావాదేవీల వివాదాలు అన్ని సద్దు మణిగి ఎట్టకేలకు ఈ శుక్రవారం (డిసెంబర్ 12న) రిలీజ్ కి సిద్ధంగా ఉంది బాలయ్య బాబు అఖండ 2 చిత్రం. అయితే ఈ మూవీని ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుండటంతో బాలయ్య అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అదేంటంటే సాధారణంగా విడుదలకు సిద్దమై రిలీజ్ ఆగిపోయిన చిత్రాలకు ఎప్పుడూ ఒక నెగెటివ్ సెంటిమెంట్ అనేది ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది.

అసలు అయితే అఖండ 2 మూవీ ఈ సంవత్సరం దసరా సందర్భంగా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ ఎంట్రీ & అఖండ 2 మ్యూజిక్ లేట్ అవటంతో డిసెంబర్ 5 కు చేంజ్ అవ్వాల్సి వచ్చింది. అలా మొదటి నుంచి ఏదో ఒక అడ్డంకి వలన అఖండ 2 చిత్రానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇలా ఎక్కువ సార్లు రిలీజ్ వాయిదా పడ్డ సినిమాలు టాలీవుడ్ లో ఇప్పటివరకు అడపాదడపా చిత్రాలు తప్ప, హిట్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ బాలయ్య అభిమానులని కలవరపెడుతుంది.

ఈ సెంటిమెంట్ ని దాటి బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన చిత్రాలలో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, రవితేజ ‘క్రాక్’ ఉన్నాయి. అదే విధంగా బాలయ్య నటించిన అఖండ 2 ను బ్లాక్ బస్టర్ గా చూడాలనేది బాలయ్య అభిమానుల సంకల్పం. ఈ సెంటిమెంటును అఖండ 2 తో బాలయ్య బాబు ఎంత వరకు అధిగమిస్తాడనేది ఈ రోజు నైట్ (డిసెంబర్ 11న) జరిగే ప్రీమియర్స్ తో తేలిపోనుంది.
