Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న డివోషనల్ అండ్ మాస్ యాక్షన్ మూవీ ‘అఖండ 2’. 2021 డిసెంబర్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ రిలీజ్ అయిన ‘అఖండ’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్న టైంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది.

Akhanda 2

బాలకృష్ణ ఈ చిత్రంతో తిరిగి ఫామ్లోకి వచ్చారు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది ‘అఖండ’. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘అఖండ 2’ రూపొందుతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. క్లైమాక్స్ లో కూడా ‘అఖండ 2’ కి లీడ్ ఇచ్చారు బోయపాటి. సీక్వెల్ కి కూడా బోలెడంత వెయిట్ ఉన్న కంటెంట్ ఉంటుందని అప్పుడే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ గ్లింప్స్ కూడా విశేషంగా ఆకట్టుకుంది.

దీంతో సినిమాపై పిచ్చ క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. వాస్తవానికి సెప్టెంబర్ 25నే ఈ సినిమా విడుదల కావాలి. కానీ వి.ఎఫ్.ఎక్స్ పనులు బ్యాలెన్స్ ఉండటంతో వాయిదా వేశారు. ఇక ‘అఖండ 2’ డిజిటల్ హక్కులకు కూడా బోలెడంత డిమాండ్ ఏర్పడింది. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ సంస్థలు ‘అఖండ 2’ డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్ గా రూ.85 కోట్లకి హాట్ స్టార్ సంస్థ ‘అఖండ 2’ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం.

ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus