Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

‘అఖండ’ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ. ‘సింహా’ ‘లెజెండ్’..లను మించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి సీక్వెల్ ఉంటుందని ఆ టైంలోనే ప్రకటించారు. ‘అఖండ’ బాలకృష్ణ కెరీర్లో 106 వ సినిమాగా రూపొందింది. ఇక ఇప్పుడు ‘అఖండ’ సీక్వెల్ అయిన ‘అఖండ 2’.. బాలయ్య కెరీర్లో 110వ సినిమాగా రూపొందింది.

Akhanda 2

వాస్తవానికి గతవారం అంటే డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఫైనాన్సియల్ ట్రబుల్స్ వల్ల.. వారం రోజులు ఆలస్యంగా అంటే డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 11నే ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. అయితే సినిమాకి మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. బోయపాటి శ్రీను కొన్ని సన్నివేశాలు ఓవర్ ది టాప్ అనే విధంగా తీశారని కొంతమంది విమర్శించారు.

ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే.. టాక్ తో సంబంధం లేకుండా ‘అఖండ 2’ మంచి ఓపెనింగ్స్ ని రాబడుతుంది. ప్రీమియర్స్ షోల రూపంలో రూ.12 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. మార్నింగ్ షోలు కొంచెం డౌన్ అయ్యాయి. అయితే మ్యాట్నీల నుండి పికప్ అయ్యింది. ఈవెనింగ్ షోలు, నైట్ షోలు బాగానే బుక్ అవుతున్నాయి. సో ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తే… మొదటి రోజు ‘అఖండ 2’ చిత్రం రూ.26 కోట్ల వరకు షేర్ ను రాబట్టే అవకాశం ఉంది.

అయితే ఆఫ్ లైన్ బుకింగ్స్ కూడా బాగుంటే.. ‘డాకు మహారాజ్’ ఓపెనింగ్స్ ని అధిగమించే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మొదటి రోజు ‘అఖండ 2’ కలెక్షన్స్ ఎలా ఉంటాయో..!

బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus