Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

సీనియర్ నటి వాహిని(Vahini) గురించి ఇప్పటితరానికి ఎక్కువ తెలిసుండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఎన్నో సీరియల్స్ లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈమె రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అడ్వాన్స్డ్ స్టేజి అని డాక్టర్లు తేల్చేశారట. అయితే ట్రీట్మెంట్ కొరకు.. అంటే కీమోథెరపీ, ఆపరేషన్లు, మందుల కోసం రూ.25 నుండి రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందట.కానీ ఆమె వద్ద వైద్యానికి సరిపడా డబ్బులు లేవు.

Vahini

దాదాపు 15 ఏళ్ళ నుండి ఆమెకు ఆఫర్లు లేవు. ఈ క్రమంలో తోటి నటీమణులు మామిళ్ళ శైలజా ప్రియా, కరాటే కళ్యాణి వంటి వారు వాహినికి ఆర్థిక సాయం చేయాలని తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ ను అలాగే వాట్సాప్ ఫాలోవర్స్ ను కోరుతూ పోస్టులు పెట్టారు. వాహిని ప్రెజెంట్ లుక్ చూసి ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. క్యాన్సర్ కారణంగా ఆమె జుట్టు ఊడిపోయింది. చాలా దయనీయంగా కనిపిస్తున్నారు.

‘నిన్నే పెళ్ళాడతా’ వంటి తమిళ డబ్బింగ్ సీరియల్స్ ద్వారా వాహిని పాపులారిటీ సంపాదించుకున్నారు. చాలా సినిమాల్లో కూడా నటించారు. ఒకానొక టైంలో ఆమెకు ఏమైందో ఏమో తెలీదు పలు బీ గ్రేడ్ సినిమాల్లో కూడా నటించారు. దిక్కుతోచని స్థితిలో ఆమె అలాంటి సినిమాల్లో నటించినట్టు ఆమె సన్నిహితులు కొంతమంది అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈమె నోయల్ నటించిన ‘బహిర్భూమి’ సినిమాలో నటించారు. అలాగే ఈ ఏడాది వచ్చిన కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమాలో కూడా నటించారు. ఇంతలో ఆమెకు ఇలా జరగడం బాధాకరం.

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus