Akhanda 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలు తారుమారు.. నిర్మాతలకు షాక్ తప్పదా?

సినిమా వాయిదా పడితే అభిమానులకు నిరాశ కలగడం సహజం. కానీ ‘అఖండ 2’ విషయంలో అది నిర్మాతల జేబులకు చిల్లులు పడేలా చేస్తోంది. ఊహించని విధంగా రిలీజ్ డేట్ మారడంతో, దాని ప్రభావం నేరుగా బిజినెస్ డీల్స్ మీద పడింది. ముఖ్యంగా డిజిటల్ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. డేట్ మారితే అంతా సెట్ అవుతుందనుకుంటే, అసలు సమస్య ఇక్కడే మొదలైంది.

Akhanda 2

నెట్‌ఫ్లిక్స్ ప్లానింగ్ ఎప్పుడూ పక్కాగా ఉంటుంది. డిసెంబర్ 5న సినిమా వస్తే, సరిగ్గా నాలుగు వారాల గ్యాప్ తర్వాత.. అంటే సంక్రాంతి సెలవుల్లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలనేది వారి స్కెచ్. పండగ టైమ్ లో ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటారు కాబట్టి వ్యూవర్షిప్ బీభత్సంగా వస్తుందని భారీ రేటు పెట్టి కొన్నారు. కానీ ఇప్పుడు థియేటర్ రిలీజ్ డేట్ మారడంతో ఆ సంక్రాంతి టార్గెట్ మిస్ అయ్యేలా ఉంది.

ఇప్పుడున్న టాక్ ప్రకారం సినిమా డిసెంబర్ 25న వచ్చే ఛాన్స్ ఉంది. పాత ఒప్పందం ప్రకారం వెళ్తే, సినిమా రిలీజైన పదిహేను, ఇరవై రోజులకే ఓటీటీలో వచ్చేస్తుంది. అదే జరిగితే థియేటర్ కలెక్షన్స్ దారుణంగా దెబ్బతింటాయి. పోనీ స్ట్రీమింగ్ డేట్ మారుద్దామా అంటే నెట్‌ఫ్లిక్స్ అంత ఈజీగా ఒప్పుకోదు. షెడ్యూల్ విషయంలో ఆ సంస్థ చాలా కచ్చితంగా వ్యవహరిస్తుంది.

ఇక్కడే నిర్మాతలకు అసలైన పరీక్ష ఎదురవుతోంది. స్ట్రీమింగ్ డేట్ ను వాయిదా వేయమని అడిగితే, ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బుల్లో నెట్‌ఫ్లిక్స్ కోత విధించే ప్రమాదం ఉంది. “మాకు ప్రైమ్ టైమ్ (సంక్రాంతి) మిస్ అవుతుంది కాబట్టి, రేటు తగ్గిస్తాం” అని మెలిక పెడితే నిర్మాతలు నష్టపోక తప్పదు. అటు చూస్తే నుయ్యి, ఇటు చూస్తే గొయ్యిలా తయారైంది పరిస్థితి. ఊహించని సమస్యల వల్ల వచ్చిన ఈ వాయిదా, కేవలం డేట్ మార్పుతో సరిపోవడం లేదు. ఫైనాన్షియల్ గా కూడా గట్టి దెబ్బే వేసేలా ఉంది. ఈ క్లిష్టమైన సమస్యను నిర్మాతలు ఎలా పరిష్కరించుకుంటారో, నెట్‌ఫ్లిక్స్ ను ఎలా ఒప్పిస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus