Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

చాలా రోజుల క్రితమే ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ గురించి మన ఫిల్మీ ఫోకస్‌లో ఓ వార్త చదివి ఉంటారు. తొలి ‘అఖండ’ దగ్గరకే రెండో ‘అఖండ’ రావడానికి చూస్తోందని. ఇప్పుడు అదే జరిగింది అని కచ్చితమైన సమాచారం వస్తోంది. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నట్లుగా ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావడం లేదు అని అంటున్నారు. దానికి ఓ నెల ముందే వచ్చేసి ఇయర్‌ ఎండింగ్‌ బెనిఫిట్‌ను పొందాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. అలా డిసెంబరు 5ని విడుదల తేదీగా ఖరారు చేసుకున్నారు అని సమాచారం.

Akhanda 2

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమా ‘అఖండ 2: తాండవం. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ అంటూ హ్యాట్రిక్ బ్లాక్‌ బస్టర్స్‌ అందుకున్న బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రమిది. ఈ సినిమాను నిజానికి సెప్టెంబరు 25న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఇతర పనులు వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు. దీంతో సంక్రాంతి టార్గెట్‌ అని అనుకున్నారంతా. కానీ డిసెంబరులోనే వచ్చేయాలని టీమ్‌ ఫిక్స్‌ అయిందట.

‘అఖండ’ సినిమాకు పొందిన ఇయర్‌ ఎండింగ్‌ బెనిఫిట్‌ను ఇప్పుడు కూడా పొందే ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ఇంకా ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాతో కలసి థియేటర్లను షేర్‌ చేసుకున్నారు. ఇప్పుడు సోలోగా బాక్సాఫీసు బరిలో ఓ నెల వరకు ఏలేయొచ్చు అని ప్లాన్‌ చేస్తున్నారట. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట.

సంక్రాంతికి బాలయ్య వస్తాడని వార్తలు రాగానే హిట్‌ సెంటిమెంట్‌, 22 ఏళ్ల నాటి పోటీ రిపీట్‌ అంటూ చాలా అంచనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు టీమ్‌ ముందుగానే వచ్చేయాలని ఫిక్స్‌ అయింది. త్వరలో గ్లింప్స్‌ రిలీజ్‌ చేసి ఈ విషయాన్ని ప్రకటిస్తారట.

దేవుడి లీల.. బాక్సాఫీసు గలగల.. టాలీవుడ్‌ హిట్‌ ఫార్ములా.. ఎన్ని సినిమాలంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus