Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన “అఖండ” ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సెన్సేషనల్ సినిమాకి సీక్వెల్ అనేసరికే అంచనాలు అంబరాన్ని తాకాయి. అటువంటి సినిమా ముందు సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నప్పటికీ.. సీజీ వర్క్ & షూటింగ్ పెండింగ్ ఉండడంతో కాస్త లేటుగా డిసెంబర్ 5కి విడుదలవుతుంది. సరిగ్గా రెండు వారాల ముందు ఈ చిత్రం ట్రైలర్ ను కర్ణాటకలోని చింతామణి ప్రాంతంలో విడుదల చేశారు. కన్నడ నటుడు శివన్న చేతుల మీదుగా “అఖండ 2” తెలుగు & కన్నడ వెర్షన్ ట్రైలర్ విడుదలైంది.

Akhanda 2 Trailer

సనాతనధర్మ రక్షకుడిగా బాలయ్య ఈ చిత్రంలో కనిపించనున్నారు. యాక్షన్ సీన్లు, మాస్ డైలాగులు ఎప్పట్లానే అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా.. M134 మినిగన్ ను త్రిశూలంతో ఆపరేట్ చేయడం అనేది బోయపాటి మార్క్ ఊరమాస్ కి ప్రతీక. అఖండతో పోల్చితే.. అఖండ2 కి చాలా పెద్ద స్కోప్ ఉంది. ఏకంగా చైనా ఆర్మీ కూడా కనిపించడం అనేది మామూలు విషయం కాదు. ఆ సెటప్ అంతా చూస్తుంటే.. బోయపాటి ఈసారి పాన్ ఇండియా లెవల్లో గట్టిగా ప్లాన్ చేశాడు అనిపిస్తుంది. ఇక తమన్ ఎప్పట్లానే టైటిల్ కి తగ్గట్లు బీజియంతో తాండవం ఆడేశాడు.

మరీ ముఖ్యంగా బాలయ్య ఈ చిత్రం కోసం కేవలం హిందీలోనే కాక కన్నడలోనూ డబ్బింగ్ చెప్పడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వయసులో సీనియర్ హీరో అయినా బాలయ్య అన్నీ భాషల్లో తన సినిమాని ప్రమోట్ చేస్తూ.. తన మార్కెట్ ను పెంచుకుంటున్న విధానం యంగ్ హీరోలకి కూడా ఇన్స్పిరేషన్. డిసెంబర్ 5న సోలో రిలీజ్ అవుతున్న “అఖండ 2”కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయడం ఖాయం. బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.

 

నో చెప్పినోళ్లు అంతా ‘వారణాసి’లో చేరుతున్నారా? తాజాగా మరో ఆర్టిస్ట్‌!

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus