Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

ఈ ఏడాది రిలీజ్ కి ముందు హైప్ సంపాదించుకున్న సినిమాలు చాలా తక్కువ. తెలుగు నుండి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ‘ఓజి’ మాత్రమే భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దాని స్థాయిలో మరే సినిమా కూడా రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేయలేకపోయింది అనేది వాస్తవం. కానీ ‘ఓజి’ తర్వాత హైప్ తెచ్చుకున్న సినిమా అంటే ‘అఖండ 2’ అనే చెప్పాలి.

Akhanda 2

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్, ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ కావడంతో ‘అఖండ 2’ కి భారీ హైప్ సొంతమైంది. ఈ సినిమాని ఓపెనింగ్ వీకెండ్లోనే వీక్షించాలి అని చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ‘అఖండ 2’ ఓపెనింగ్స్ తో భారీ మొత్తం వెనకేసుకోవాలని మేకర్స్ కూడా భావిస్తున్నారు.అందుకే టికెట్ రేట్ల పెంపు కోసం రెండు ప్రభుత్వాల నుండి అనుమతులు తెచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలో వారు కొంచెం అత్యాశకి పోతున్నారేమో అనేది కొందరి వాదన. విషయమేంటంటే.. ‘అఖండ 2’ టికెట్ హైక్స్ లో ప్రీమియర్ షోలకి టికెట్ రేట్లు రూ.600 పెట్టారు. ఆ విషయంలో పర్వాలేదు పెద్ద సినిమాలకి రూ.800 రూ.1000 రూ.1200 అలా పెట్టేసుకుంటున్నారు. బాలయ్య వంటి సీనియర్ స్టార్ హీరో నటించిన ‘అఖండ 2’ కి ప్రీమియర్స్ టికెట్ రూ.600 అంటే పర్వాలేదు.

కానీ మొదటి రోజు నుండి నైజాంలో మల్టీప్లెక్సుల్లో రూ.413, సింగిల్ స్క్రీన్స్ లో రూ.250 వరకు టికెట్ రేట్లు పెడుతున్నారు. ఆంధ్ర విషయానికి వస్తే మల్టీప్లెక్సుల్లో రూ.325, సింగిల్ స్క్రీన్స్ లో రూ.200 వరకు టికెట్ రేట్లు పెట్టారు. ఇవి సామాన్యులని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. ‘అఖండ’ సినిమాకి టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్లే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాని చూశారు.

కానీ ‘అఖండ 2’ కి ఈ రేంజ్లో టికెట్ రేట్లు పెడితే.. సామాన్యులు థియేటర్ కి వెళ్లి సినిమాని చూస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనప్పటికీ హైప్ ఉన్న సినిమా కాబట్టి.. వీకెండ్ వరకు ఈ హైక్స్ ఉంటే ఓకే. వీక్ డేస్ లో కూడా ఇవే రేట్లు ఉంటే.. కష్టమైపోతుంది. ఇది మేకర్స్ గమనించి వీక్ డేస్ లో తగ్గిస్తే బెటర్.

కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus