కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ‘దేవర 2′ గురించి చాలా రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.’దేవర 2’ పై ఎన్టీఆర్ కి ఇంట్రెస్ట్ లేదని, ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడని, అందుకే దర్శకుడు కొరటాల శివ కూడా వేరే హీరోతో సినిమా సెట్ చేసుకుంటున్నట్టు ఆ గాసిప్స్ యొక్క సారాంశం. వీటి వల్ల ‘దేవర 2’ ప్రాజెక్టు ఆగిపోయింది అని నమ్మేసిన వాళ్ళ సంఖ్య 90 శాతానికి చేరుకుంది.
వికీపీడియాలో సైతం ‘దేవర 2’ ప్రాజెక్ట్ షేల్వ్(నిలిచిపోయినట్టు) మెన్షన్ చేశారు అంటే.. ఆ గాసిప్స్ తీవ్రత ఏ రేంజ్లో పాకిందో అర్ధం చేసుకోవచ్చు.అయితే అవి పూర్తిస్థాయిలో వాస్తవాలు కాదు. దర్శకుడు కొరటాల శివకి ఎన్టీఆర్ ఇచ్చిన క్లారిటీ వేరు. మేటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.
ఎన్టీఆర్ కి గాయాలు అవ్వడం, అలాగే వార్ 2 రిలీజ్ వంటి వ్యవహారాల కారణంగా ‘డ్రాగన్’ షూటింగ్ డిలే అయ్యింది. సో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేందుకు మరింత టైం పడుతుంది. ఇది పూర్తయిన వెంటనే ‘దేవర 2’ కోసం ఎన్టీఆర్ 35 రోజులు కాల్ షీట్స్ ఇచ్చేందుకు ముందుగా అంగీకరించాడు. కానీ ఇప్పుడు ‘డ్రాగన్’ ఆలస్యమవుతుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా మొదలుపెట్టాల్సి ఉంది.
అందుకే ‘దేవర 2’ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివని ‘ఒక సినిమా చేసుకుని రా’ అని ఎన్టీఆర్ సూచించాడట. అందుకే కొరటాల కూడా యంగ్ హీరోతో సినిమా చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలు క్లారిటీ ఇది.