Akhil: ఆ సినిమా చేస్తే వెళ్లాల్సిందేగా అఖిలూ…!

టాలీవుడ్‌ హీరోలను మీరు బాలీవుడ్‌, హాలీవుడ్‌ వెళ్తారా అంటే… అంత ఈజీగా ‘యస్‌’ అని చెప్పరు. ఎందుకో తెలియదు కానీ… ముందుకైతే రారు. మహేష్‌బాబును మీడియా చాలా రోజుల నుండి అడుగుతూనే ఉంది. ప్రతిసారి ఆయన ‘నో’ అని చెబుతూనే ఉన్నారు. అయితే ఎక్కడో… ఆయన బాలీవుడ్‌ ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అఖిల్‌ కూడా ఇదే మాట చెబుతున్నారు. ‘నో బాలీవుడ్‌.. నో హాలీవుడ్‌’ అని అంటున్నారు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో లైఫ్‌ స్టోరీస్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్పోర్ట్స్‌ మ్యాన్‌ బయోపిక్స్‌ను విరివిగా తీస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ఆ మధ్య అఖిల్‌ను ఇదే మాట అడిగింది. ‘మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు’ అని. దానికి అఖిల్‌… ‘విరాట్‌ కోహ్లీ బయోపిక్‌’ అయితే సూపర్‌ అన్నారు. కోహ్లీ జీవితంలో చాలా రకాల షేడ్స్‌ ఉన్నాయి. చిన్న స్థాయి నుండి ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ అయ్యాడు. అతని బయోపిక్‌ అయితే రెడీ అన్నాడు.

ఇదే ఇప్పుడు పాయింట్‌గా మారింది. కోహ్లీ బయోపిక్‌ తీయడానికి ఇప్పటికిప్పుడు టాలీవుడ్‌లోనే ఆ సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా అది పాన్‌ ఇండియా సినిమానో, లేక బాలీవుడ్‌ సినిమానో అవుతుంది. కాబట్టి అఖిల్‌ వెళ్లనూ వెళ్లనూ అంటూనే ‘కోహ్లీ’ కోసం టాలీవుడ్‌ గడప దాటాల్సిందే తప్పదు అని అర్థమవుతోంది. ఏమంటారు మీరు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus