Akhil: వారం రోజుల షూటింగ్ తరవాత వేరే బాబును తీసుకున్నారా..!

నాగార్జున రెండో కుమారుడు అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015లో అఖిల్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన అది ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అఖిల్ తన తదుపరి చిత్రాలు హలో, మిస్టర్ మజ్ను సక్సెస్ అందుకోలేక బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మాత్రం యూత్ ను ఆక‌ట్టుకుంది. నిర్మాతలకు కాస్తో కూస్తో డబ్బులు తెచ్చి పెట్టింది.

ఇంత‌లోనే అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఏజెంట్ మాత్రం భారీ డిజాస్టర్ గా నమోదైంది. దీంతో నిర్మాతకు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాడు. ప్రస్తుతం అఖిల్ తన తదుపరి సినిమా పై దృష్టి పెట్టాడు. ఇది ఇలా వుంటే.. అఖిల్ తన ఏడాది వ‌య‌సులోనే సిసింద్రీ సినిమాలో నటించాడని అందరికీ తెలిసిందే. ఆ సినిమా 1995లో విడుద‌లై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

సినిమాలో నాగార్జున‌, ట‌బు, ఆమని, శరత్ బాబు తదితరులు నటించారు. అయితే అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మ‌రో సినిమా చేశాడు.. అదేంటో మీకు తెలుసా?ఇంత‌కీ అఖిల్ నటించిన రెండో సినిమా ఏంటో తెలుసా.. అదే సంతోషం. దశరథ్ ద‌ర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో నాగార్జున, శ్రియా, గ్రేసీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో నాగార్జున కుమారుడిగా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ అక్షయ్ బ‌చ్చు గుర్తుండే ఉంటాడు.

అయితే మొద‌ట అక్షయ్ పాత్రలో నాగార్జున‌ను అతి క‌ష్టం మీద ఒప్పించి అఖిల్ ను తీసుకున్నాడ‌ట డైరక్టర్ దశరథ్‌. అఖిల్‌, నాగార్జున ఇద్దరితో కొన్ని సన్నివేశాలు కూడా వారం పాటు చిత్రీకరించారట. కానీ, ఆ త‌ర్వాత అఖిల్‎కు ఫుల్ జ్వరం భారిన పడాడట. రెండు రోజుల్లో త‌గ్గిపోతుంద‌ని అనుకున్నా.. ప‌ది రోజులైనా త‌గ్గలేదట. దాంతో చేసేదేమి లేక ద‌శ‌ర‌థ్ అఖిల్ (Akhil) స్థానంలో అక్షయ్ బచ్చును తీసుకున్నారట.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus