నాలుగో సినిమాతోనైనా హిట్ కొట్టాలని ఫిక్సైన అఖిల్

  • February 18, 2019 / 06:44 PM IST

అక్కినేని నాగార్జున తనయుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అఖిల్ ఇప్పటి వరకు సరైన హిట్ సాధించలేదనే చెప్పాలి. మాస్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన వి.వి.వినాయక్ డైరెక్షన్లో చేసిన మొదటి చిత్రం ‘అఖిల్’ ఘోరమైన డిజాస్టరైన సంగతి తెలిసిందే. అయితే డ్యాన్సులకు, ఫైట్ల కు మాత్రం అఖిల్ కు మంచి మార్కులే పడ్డాయి. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ ను మాస్ హీరోగా నిలబెట్టాలని నాగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక అయిందేదో అయ్యిందిలే అనుకుని ‘మనం’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్ ను పెట్టాడు నాగ్. అఖిల్ రెండవ సినిమాగా వచ్చిన ‘హలో’ చిత్రం మంచి రివ్యూలను దక్కించుకున్నప్పటికీ సరైన కలెక్షన్లను రాబట్టలేక పోయింది. ఇక మొన్న విడుదలైన మిస్టర్ మజ్ను కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

అందుకే అఖిల్ నాలుగో సినిమా విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నాడు నాగార్జున. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగో సినిమాతోనైనా హిట్ కొట్టాలని అఖిల్ కూడా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వడంతో హిట్ మేకర్ అల్లు అరవింద్ ను సంప్రదించి ఆయన బ్యానర్ లో “గీత గోవిందం”తో 100 కోట్ల రూపాయల సినిమా అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేశారట. ఫ్యామిలీ సెంటిమెంట్స్ తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా సమానమైన పాళ్లలో మిస్క్ చేయగల సమర్ధుడైన పరశురామ్ అయితేనే బెటర్ అని అందరూ అనుకున్నారు. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus