Akhil: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతున్న అఖిల్!

అఖిల్ అక్కినేని పరిచయం అవసరం లేని పేరు నాగార్జున వారసుడిగా అఖిల్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినటువంటి ఈయన ఇప్పటివరకు సుమారు ఐదు సినిమాలలో నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఒక స్టార్ హీరో కుమారుడిగా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఇప్పటివరకు సరైన హిట్ పడకపోవడం అక్కినేని అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తుంది. అఖిల్ కెరియర్ పరంగా నాగార్జున తనకు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం అఖిల్ కూడా ఎంతో కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పాలి. ఇక తదుపరి సినిమాల కోసం కూడా అఖిల్ భారీ స్థాయిలోనే కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈయనకు ఇప్పటివరకు అదృష్టం కలిసి రాకపోవడంతో ఈయన తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. హీరోయిన్స్ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.

ఇలా సర్జరీల ద్వారా తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటారు ఈ క్రమంలోనే హీరోయిన్స్ బాటలోనే అఖిల్ సైతం సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యారట. చూడటానికి హీరో కటౌట్ అయినప్పటికీ ఈయన ముక్కు కారణంగా ఆయన ఫేసులో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు అవి సరిగా కనిపించడం లేదని , అందుకే విదేశాలకు వెళ్లి మరీ ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఈ విధంగా (Akhil) అఖిల్ తన ముక్కుకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా కనిపించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి అఖిల్ సర్జరీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది. ఇక చివరిగా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం తీవ్రస్థాయిలో నిరాశపరిచిందని చెప్పాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags