Akhil: ఇన్నాళ్ల గ్యాప్‌ను ఫిల్‌ చేసే పనిలో అఖిల్‌.. ఆ రెండు ప్రాజెక్టులూ..!

విజయాలు ఉన్నా లేకపోయినా.. ‘హలో’ (Hello) సినిమా వరకు ఏడాదికి ఒక సినిమా చేస్తూ వచ్చాడు. అయితే 2019 నుండి రెండేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు. ఆ లెక్కన ఈ ఏడాది ఆయన నుండి సినిమా వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే వచ్చే ఏడాది కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయం తేలకే అభిమానులు ఆటు ఇటుగా ఉన్న సమయంలో.. ఒకేసారి రెండు సినిమాలు అనే కొత్త టాక్‌ ఒకటి బయటకు వచ్చింది.

Akhil

అఖిల్‌కి ఉన్న ఇన్‌స్టంట్‌ ఫ్యాన్‌ బేస్‌, స్టార్‌ హీరో లుక్స్‌, ఛార్మ్‌కు సరైన సినిమాలు పడుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. తనకంటూ ఉన్న జోనర్‌ ఇమేజ్‌లో కాకుండా యాక్షన్‌ ఇమేజ్‌కి ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతూ అటువైపు వెళ్తున్నాడు. పోనీ అక్కడైనా విజయాలు ఉన్నాయా అంటే లేవు. దీంతో విజయం కోసం ఈసారి భారీ ప్లానింగ్‌ వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే పనిలో ఉన్నారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ అదిగో ఇదిగో అంటున్నారు కానీ అనౌన్స్‌ చేయడం లేదు.\

అఖిల్‌ (Akhil Akkineni) నెక్స్ట్‌ సినిమా అంటే.. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద తెరకెక్కబోయేదే. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఏమైందో ఏమో కానీ ఆ సినిమా ఇంకా అనౌన్స్‌ చేయడం లేదు. ‘విశ్వంభర’  (Vishwambhara) సినిమా పనులు అయిపోయాక ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు. ఇదొక్కటే అని అనుకుంటుంటే.. కాదు కాదు మరో సినిమా ఉంది అని అంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం చూస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్‌ టీమ్‌ దగ్గరకు వచ్చిన ఓ కథకు నాగార్జున (Nagarjuna) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అఖిల్‌కి కూడా కథ నచ్చిందట. దీంతో ఈ రెండు సినిమాలను ఒకేసారి స్టార్ట్‌ చేస్తారు అని టాక్‌. మరి కథేంటి ఆ సంగతేంటి అనేది త్వరలో తెలుస్తుంది.

ఖాళీ అయిన క్రిస్మస్‌.. ఆ హీరో క్లారిటీ మీదే అందరి చూపు.. ఏం చెబుతాడో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags