Akhil Akkineni: అఖిల్.. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయంటే..?

టాలీవుడ్ అక్కినేని ఫ్యామిలీ మరో పెద్ద వేడుకకు సిద్ధమవుతోంది. నాగార్జున  (Nagarjuna)  చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) త్వరలో వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నాడు. గత ఏడాది ప్రేయసి జైనాబ్ రేవడ్జీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్, ఇప్పుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నాగచైతన్య  (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం అక్కినేని ఇంటి ఆరంభ వేడుక అయితే, ఇప్పుడు అఖిల్ పెళ్లి ప్రధాన హైలైట్‌గా మారనుంది.

Akhil Akkineni

ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. నాగార్జున వ్యక్తిగతంగా ఈ వేడుకను పర్యవేక్షిస్తున్నాడని టాక్. చైతూ-శోభిత పెళ్లి ఇదే వేదికపై జరగగా, ఇప్పుడు అఖిల్ పెళ్లి కూడా అక్కడే జరగనుందని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లి తేది పైనే ఉంది.

తాజా సమాచారం ప్రకారం, మార్చి 24వ తేదీన అఖిల్, జైనాబ్ ఒక్కటవ్వనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ వేడుకగానే ఈ వివాహాన్ని జరపాలని అక్కినేని కుటుంబం ప్లాన్ చేస్తోంది. అయితే, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అఖిల్ సన్నిహితమైన క్రికెట్ స్టార్స్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న అఖిల్, ఇటీవలే జైనాబ్‌తో కలిసి షాపింగ్ చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మ్యారేజ్ కాస్త లిమిటెడ్ గానే ప్లాన్ చేస్తున్నా, గ్రాండ్ గా నిర్వహించేందుకు కుటుంబం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. పెళ్లి తర్వాత నూతన వధూవరులు హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం కెరీర్ పరంగా అఖిల్ కొంత స్లోగానే ఉన్నాడు. ‘ఏజెంట్’ (Agent)తర్వాత తన తదుపరి సినిమా ప్రకటించలేదు. కానీ రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని, పెళ్లి తర్వాత అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus