బిగ్ బాస్ 4: అమ్మ చెప్పింది..! అందరూ కలిశారు..!

బిగ్ బాస్ హౌస్ లో 70రోజులకి పైగా ఉన్నా కూడా హౌస్ మేట్స్ మధ్యలో అంతరాలు పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు గొడవని వారం మొత్తం గుర్తుపెట్టుకుని, టాస్క్ లలో ఆడేటపుడు ఆర్గ్యూమెంట్ పెట్టుకోవడం అనేది మనం చూస్తునే ఉన్నాం. ఈసీజన్ లో ముఖ్యంగా అఖిల్ కి – అభిజిత్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గున మండింది. పులి – మేక గొడవ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా.

అంతేకాదు, ఇద్దరి ఆర్గ్యూమెంట్ లో ఎప్పుడూ కూడా మోనాల్ బలైపోతూనే వచ్చింది. ఇద్దరూ హాయ్ హాయ్ అని చెప్పుకున్నా, అఖిల్ బర్త్ డేకి అభిజిత్ విష్ చేసినా కూడా అది నామమాత్రంగానే ఉండిపోయింది. అంతేకాదు, అభిజిత్ టాస్క్ గెలిచినా కూడా అఖిల్ సోసోగానే కంగ్రాట్స్ చెప్పాడు తప్ప, మనస్పూర్తిగా అయితే ఇద్దరూ కలవలేదు. అయితే, ఇప్పుడు అఖిల్ మదర్, అభిజిత్ మదర్ వచ్చి వాళ్ల ఆప్యాయానురాగాలతో వీరిలో స్నేహపుజల్లులు కురిపించారు. ముఖ్యంగా అఖిల్ మదర్ అభి, మీ బ్రదర్ ని బాగా చూస్కో అంటూ చెప్పేింది. అలాగే, అభిజిత్ మదర్ గేమ్ లో జరిగినవి గేమ్ లోనే మర్చిపోండి అంటూ సలహా ఇచ్చింది.

అంతేకాదు, కుమ్ముకోండి – కొట్టుకోండి అదే కదా మజా.. కానీ పర్సనల్ గా మాత్రం తీస్కోవద్దు అంటూ చెప్పింది. దీంతో బాగా స్పూర్తి పొందిన హౌస్ మేట్స్ ఒకర్ని ఒకరు హగ్ చేస్కున్నారు. ముఖ్యంగా అఖిల్ అండ్ అభిజిత్ ఇద్దరూ కూడా కలిసిపోయారు. కన్నతల్లి చెప్పిన మాటలకి కరిగిపోయారు. హౌస్ మేట్స్ అందరూ గ్రూప్ గా హగ్ చేస్కుని బిగ్ బాస్ బిగ్ బాస్ అంటూ నినాదాలు చేశారు. అమ్మ చెప్పింది అందరూ కలిశారు. అదీ మేటర్. మరిన్ని ఇంట్రస్టింగ్ బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ వెబ్ సైట్ కి లాగిన్ అవ్వండి.

strong>Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus