పెళ్లి ప్రశ్నకు అఖిల్‌ సమాధానం ఇచ్చాడా?

బిగ్‌బాస్‌ ఉన్నన్ని రోజులు మోనాల్‌ – అఖిల్‌… అఖిల్ – మోనాల్‌. సోషల్‌ మీడియాలో బిగ్‌ బాస్‌ గురించి జరిగే చర్చలో ఈ రెండు టాపిక్‌లే. నిజానికి ఈ రెండూ ఒకే టాపిక్‌ అనుకోండి. అయితే దీనికి తగ్గట్టే వాళ్లు కూడా ఏదో లవర్స్‌ లాగే చట్టాపట్టాలేసుకొని బిగ్‌బాస్‌ జంటగా మెలిగారు. తీరా బయటికొచ్చాక అందరిలాగే నా దారి నాది అనుకుంటారా అంటే… కొత్త సంవత్సరం సందర్భంగా భుజాల మీద చేతులేసుకుంటూ ఫొటోలు దిగారు. కట్‌ చేస్తే అఖిల్‌ ప్రస్తావన తెస్తేనే మోనాల్‌ కస్సుబుస్సు మంటోంది. మరి దానికి అఖిల్‌ ఏమంటున్నాడంటే?

బిగ్‌ బాస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అఖిల్‌ ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల పనిలో ఉన్నాడు. విలన్‌గా మంచి గుర్తింపు కావాలని గతంలోనే అఖిల్‌ చెప్పాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చాక వీటితోపాటు సోషల్‌ మీడియాలో కూడా అఖిల్‌ బాగా బిజీ అయ్యాడు. రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా లో అభిమానులతో చిట్ చాట్‌ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ సందర్బంగా పెళ్లి కొంతమంది అఖిల్‌ దగ్గర ప్రస్తావించారు. దానికి అఖిల్‌ స్పందిస్తూ తనకు పెళ్లిపై చాలా క్లియర్‌ గా అభిప్రాయం ఉందని చెప్పుకొచ్చాడు.

‘‘నాకు ప్రేమ మీద నమక్మకం ఉంది. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించిన అమ్మాయి అయితేనే అర్థం చేసుకుంటుంది. అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి జీవితంలో మంచి అనుబంధం ఏర్పడుతుంది’’ అంటూ అఖిల్‌ తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మరి మోనాల్‌ను పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు మాత్రం అఖిల్‌ సమాధానం ఇవ్వలేదు. ముందు తిరగడం ఎందుకు… ఇప్పుడు మాట దాటేయడం ఎందుకు అఖిలూ.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus