Akhil: నాగార్జునకు మెమరబుల్‌ మూవీ ఇచ్చిన డైరక్టర్‌తో అఖిల్‌ నెక్స్ట్‌!

అఖిల్‌ కొత్త సినిమా ఏంటి.. ఈ ప్రశ్నకు ‘ఏజెంట్‌’ అనే సమాధానం చెప్పే రోజులు అయిపోయాయి. ఎందుకంటే ఆ సినిమా వచ్చేసింది. దీంతో ఇప్పుడు కొత్త సినిమా ఎవరితో, ఎలా ఉండొచ్చు అనే చర్చలు మొదలయ్యాయి. ‘ఏజెంట్‌’ వచ్చేంతవరకు అఖిల్‌ వేరే సినిమా ఆలోచనే చేయలేదు. ఆ సినిమా కోసం అంత కష్టపడ్డాడు మరి. రెండేళ్ల కష్టం ఆ సినిమా. దీంతో ఈ సినిమా తర్వాత అఖిల్‌ ఏం చేస్తాడు అనేది చర్చ. యంగ్‌ హీరోల్లా లవ్‌ స్టోరీవైపు వెళ్తాడా? లేక మాస్‌ సినిమా మీద మనసు పడతాడా అని అనుకుంటున్నారు.

అఖిల్‌ నెక్స్ట్‌ ఏంటి? అనే ప్రశ్నకు తాజాగా వినిపిస్తున్న సమాధానం వంశీ పైడిపల్లి సినిమా అని. అవును అఖిల్‌కి చాలా రోజుల క్రితం వంశీ పైడిపల్లి ఓ కథ వినిపించారట. అప్పుడు ఓకే అనుకున్నా.. ‘ఏజెంట్‌’ తర్వాత మాట్లాడదాం అనుకున్నారట. ఇప్పుడు ‘ఏజెంట్‌’ ముచ్చట తీరిపోయింది కాబట్టి కొత్త సినిమా స్టార్ట్‌ చేసేస్తారు అని అంటున్నారు. ‘వారసుడు’ సినిమాతో ఇబ్బందికర ఫలితం అందుకున్న వంశీ పైడిపల్లి ప్రస్తుతం కథల పనిలోనే ఉన్నారట.

అఖిల్‌ (Akhil) నుండి పిలుపు వస్తే ఆ కథను ఫైనల్‌ చేసి పట్టాలెక్కిస్తారని సమాచారం. అయితే, ఈ సినిమాకు నిర్మాత ఎవరు ప్రశ్న కూడా వినిపిస్తోంది. నిజానికి వంశీ పైడిపల్లి సినిమా అంటే నిర్మాతగా దిల్‌ రాజు పక్కా అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకు దిల్‌ రాజు నిర్మాతనా? లేక వేరే నిర్మాతతో కలసి చేస్తారా అనేది చూడాలి. మరోవైపు శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాణంలో అఖిల్‌ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే అప్పుడు దర్శకుడు ఎవరు అనేది చెప్పలేదు.

‘ఏజెంట్‌’ పని అయిపోయింది కాబట్టి త్వరలోనే ఈ క్లారిటీ కూడా వస్తుంది అని చెప్పొచ్చు. ఇక నాగార్జున వందో సినిమాగా మోహన్‌ రాజా చేయబోతున్న సినిమాలో అఖిల్‌ ఉన్నాడు. అయితే ఈ సినిమాకు ఇంకా సమయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్‌ దర్శకుడిగా మారి నాగ్‌ 99వ సినిమా చేస్తున్నారు. అదయ్యాకనే మోహన్‌ రాజా సినిమా ఉంటుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus