Akhil: అఖిల్ ప్రేమకథలో ఊహించని మలుపు ఇదేనా ! అసలు ఏం జరిగింది.?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ప్రేమకథల టాస్క్ నడిచింది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ తమ తొలిప్రేమ కథలని హౌస్ మేట్స్ తో పంచుకున్నారు. అఖిల్ తన లవ్ గురించి చెప్పాడు. స్కూల్ లో ఉన్నప్పుడు తనని చిన్నూ అని పిలిచేవాడ్ని. ఒకే కాలనీలో ఉండేవాళ్లం. ఫస్ట్ లో ఒకరినొకరు తిట్టుకునేవాళ్లం, కొట్టుకునే వాళ్లం. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మేము ఎప్పుడూ లవ్ లో పడతాం అని అనుకోలేదు.

ఒకరోజు పక్కవీధిలోకి పిలిచి మరీ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ లో తన ప్రేమని నాకు తెలిపింది. కానీ, రక్తంతో రాసింది. చేతికి ఉన్న గాయాలు చూసి అనిపించింది నాకోసం ఇలా చేసిందని. ఆ తర్వాత చాలాకాలం మా లవ్ ని నడిపించాం. ఇంజనీరింగ్ లో నాలుగో సంవత్సరం వరకూ ఇలాగే ఉంటే, మనం లవ్ అని ఫిక్స్ అవుదాం అని నేను చెప్పాను. లాస్ట్ ఇయర్ లో ఉండగా, తన నుంచీ ఫోన్ వచ్చింది.

అయితే, గతంలో చాలాసార్లు కెనడా నుంచీ అబ్బాయి వచ్చాడని, తన లాంగ్వేజ్ అదీ బాగుందని చాలాసార్లు చెప్పింది. ఒకరోజు తనకి ఫోన్ చేసేటపుడు మార్నింగ్ నుంచీ ఎంగేజ్ వస్తూనే ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగినపుడు వాళ్ల నాన్నతో అంటూ అబద్దం చెప్పింది. హాస్టల్ కి ఇంటికి చాలా దగ్గరే కదా, మాట్లాడేబదులు వెళ్లి రావచ్చు కదా అని అడిగితే, నాపైన నమ్మకం లేదా అంటూ అడిగింది.

రిలేషన్ లో ఇలా ఉంటే కష్టం అన్న ఒక్క మాట అన్నందుకు అదే మాటని రిపీట్ చేస్తూ బ్రేకప్ చెప్పేసింది. లెస్ట్ బ్రేకప్ అని చాలాసార్లు చెప్పింది. నేను మాత్రం ఒప్పుకోలేదు. తన ఫ్రెండ్ మాత్రం నాకు ఎప్పటికప్పుడు తన గురించి చెప్తూనే ఉంది. ఇక నేను కొద్దిగా బ్యాక్ స్టెప్ వేశా. చాలా కాలం తర్వాత మళ్లీ కాల్ చేసింది. కర్మా ఈజ్ బ్యాక్ అన్నట్లుగా, నేను నిన్ను వదిలేశా, ఆ కెనడా అబ్బాయి నన్ను వదిలేశాడు అంటూ చెప్పింది.

ఇక అక్కడ్నుంచీ లవ్ అంటే కొద్దిగా భయపడతాను. ఫస్ట్ లవ్ లో మ్యాజిక్ అనేది మళ్లీ జరగదని అనిపిస్తుంది. ఇక ఎప్పటికీ తన మీద కోపం లేదు. కేవలం స్ట్రాంగ్ గా మారేందుకు దోహదపడిందంటూ ముగించాడు అఖిల్. ఇక హౌస్ మేట్స్ ని ఇంప్రెస్ చేసే టాస్క్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అందరూ రిజక్ట్ చేశారు. దీంతో అఖిల్ జోక్స్ వేస్తూ వాళ్లని టీజ్ చేశాడు. టాస్క్ లో భాగంగా పర్ఫెక్ట్ మ్యాచ్ కాలేకపోయాడు అఖిల్. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus