Akhil, Bindu Madhavi: మార్నింగ్ యాక్టివిటీలో మజా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో హౌస్ మేట్స్ మద్యలో బాండింగ్ అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది. ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ టాస్క్ లలో కో ఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక గత రెండు మూడు వారాలుగా బిందుమాధవికి ఇంకా అఖిల్ కి మద్యలో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఓంకార్ హౌస్ లోకి వచ్చినపుడు ఇద్దరికీ ఒక టాస్క్ ఇచ్చి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేశాడు. దీంతో వారిద్దరి మద్యలో ఉన్న గ్యాప్ మెల్లగా తగ్గింది.

Click Here To Watch NEW Trailer

అంతేకాదు, అంతకుముందు మార్నింగ్ యాక్టివిటీలో కూడా తేజస్వి వీరిద్దరినీ కలిపే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ హౌస్ లో మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా హౌస్ మేట్స్ తాగుబోతులుగా మారి ఒక్కో సిట్యువేషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడే అఖిల్ తాగుబోతుగా మారి తన మాజీ ప్రేయసికి ఫోన్ చేసే టాస్క్ ఆడాడు. ఇందులో తన మాజీ ప్రేయసి బిందు అంటూ చెప్పేసరికి హౌస్ మేట్స్ అందరూ గోల చేశారు.

ఇక బిందు కూడా స్పోర్టివ్ గా తీస్కుని టాస్క్ లో కో ఆపరేట్ చేసింది. బిందు ఐలవ్ యూ అంటూ స్కిట్ ని మరో లెవల్లో ప్రజెంట్ చేశాడు అఖిల్. అసలే ఇద్దరి మద్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గునమండే సమయంలో వీళ్లు ఇలా సరదాగా స్కిట్ చేయడం అనేది హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా మంచి కిక్ ఇచ్చింది. టాస్క్ ఆడేటపుడు కూడా బిందుతో మంచిగానే ఉంటున్నాడు అఖిల్.

ఎక్కడా కూడా ఇది వరకూ ఉన్నట్లుగా లేడు. ఇక బిందు సైడ్ నుంచీ కూడా అఖిల్ పై ఉన్న ఇష్యూస్ ని క్లియర్ చేస్కుంటూ వస్తోంది. మొత్తానికి టఫ్ ఫైట్ ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబోతున్నారన్నమాట. అదీ మేటర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus