Pallavi prashanth: రైతు అని చులకనగా చూస్తున్నారా.. అఖిల్ సార్థక్ ఏమన్నారంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా పల్లవి ప్రశాంత్ ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే అదే సమయంలో పల్లవి ప్రశాంత్ పై ట్రోల్స్ వస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని పెంచుకున్న అఖిల్ సార్థక్ పల్లవి ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అఖిల్ సార్థక్ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ కు అందరూ భయపడ్డారని అన్నారు. కావాలనే అందరూ అతనిని టార్గెట్ చేస్తున్నారని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని అతను స్ట్రాంగ్ గా ఉండాలని అఖిల్ సార్థక్ పేర్కొన్నారు. మనం ఆర్టిస్టులమని అలాంటి మనమే బిగ్ బాస్ షో అంటే ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీలవుతామని అఖిల్ సార్థక్ అన్నారు. మనం ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడతామని ఆయన కామెంట్లు చేశారు.

పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏదో ఒకటి చేయాలని సంబరపడ్డాడని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడని లవ్ ట్రాక్ తో కామెడీ చేయాలని అనుకున్నాడని కానీ అది కరెక్ట్ కాదని అఖిల్ తెలిపారు. పల్లవి ప్రశాంత్ చేసిన దానిలో తప్పేముందని కొంతమంది ప్రశాంత్ ను అరేయ్, రా అంటున్నారని రైతుబిడ్డ అని చులకనగా చూస్తారా అని అఖిల్ ప్రశ్నించారు.

ఉల్టాఫుల్టా నామినేషన్స్ అంటే అందరూ మాట్లాడతారు కానీ పల్లవి ప్రశాంత్ ను మాత్రం మాట్లాడనివ్వడం లేదని పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అన్ని సీజన్లు చూసి వచ్చాడని అంటున్నారని బిగ్ బాస్ షో అంటే అందరికీ ఇష్టమని ఆ షో చూస్తే తప్పేంటని అఖిల్ సార్థక్ ప్రశ్నించారు. అఖిల్ సార్థక్ కామెంట్లు కూడా నిజమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ సార్థక్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus