Bigg Boss Telugu OTT: జూనియర్స్ టాప్ 5 కి వెళ్లాలని ఏం చేస్తున్నారో తెలుసా..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 ఈసారి అదిరిపోయింది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఛాలెంజర్స్ సీనియర్స్ కి కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. ప్రతి విషయంలో లాజిక్స్ మాట్లాడుతూ ఆర్గ్యూమెంట్ చేస్తూ ఇరిటేట్ చేస్తున్నారు. సీనియర్స్ అందరూ ఒకటిగా మారినా కూడా వాళ్లని ఎదిరించలేకపోతున్నారు. స్మగ్లర్స్ అండ్ పోలీస్ టాస్క్ లో ఎవరు మిస్టేక్ చేశారు అనేది కాసేపు ఎనలైజ్ చేస్కున్నారు. ఇక్కడే అఖిల్ మాట్లాడిన మాటలకి బిందుమాధవి హర్ట్ అయి అన్నం పెట్టుకుంటున్న ప్లేట్ ని అక్కడ పారేసి వెళ్లింది.

Click Here To Watch Now

అఖిల్ అనిల్ తో సరదాగా మాట్లాడుతూనే మరి స్మగ్లర్స్ వండిన ఫుడ్డే తింటున్నావ్ గా అని అనిల్ ని టీజ్ చేశాడు. కానీ బిందు రియాక్షన్ ఇచ్చింది, చైతూ వత్తాసు పలుకుతూ ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. కావాలనే చైతూ ఇన్వాల్ అయ్యి అఖిల్ తో గొడవకి దిగాడా ? టాప్ 5 కి వెళ్లాలంటే అతన్ని టార్గెట్ చేస్తే చాలు అనుకుంటున్నారా అనేది తెలియాలి. ఇక అఖిల్ పక్కకి వెళ్లి నేను అనిల్ తో సరదాగా మాట్లాడినా కూడా వక్రీకరిస్తున్నారంటూ బాధపడ్డాడు.

ఇందులో చైతూ ఇన్వాల్ అయి మాటకి మాట చెప్తుంటే తీస్కోలేకపోయాడు అఖిల్. ఎమోషన్స్ తో గేమ్ ఆడుతున్నారనే ఫీలింగ్ లో ఉన్నాడు. జూనియర్స్ కూడా చాలామాటలు అంటున్నారు, మాకు కూడా బిపి వస్తోందంటూ మాట్లాడాడు అఖిల్. ఇక్కడ అఖిల్ ని కావాలనే జూనియర్స్ టార్గెట్ చేస్తున్నారా అనే అనిపిస్తోంది. ముఖ్యంగా ఛాలెంజర్స్ గ్రూప్ గా ఫామ్ అయ్యారు. వాళ్ల నుంచే ఎక్కువ అఖిల్ కి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చైతన్య, బిందు, శివ ఈ ముగ్గురూ ఒక గ్రూప్ అయిపోయారు. అఖిల్ ని లాజికల్ గా ఎక్కడైనా సరే లాక్ చేద్దామనే మాట్లాడుతున్నాడు.

ప్రతి విషయానికి కూడా జనాలు చూస్తున్నారని, కెమెరాలు చూస్తున్నాయని అంటున్నారు. అలాగే చైతూ అఖిల్ ని తెలివిగా ఇరికించేద్దామని చూస్తున్నాడు. అఖిల్ ని లాక్ చేసి దెబ్బకొడితేనే టాప్ 5 వరకూ వెళ్లచ్చని ఆల్రెడీ స్కెచ్ గీసేసినట్లుగానే అనిపిస్తోంది. మరోవైపు టాస్క్ గురించి ఇక సీనియర్స్ కూడా వాళ్లకి చెప్పి చెప్పి అలసిపోయారు. ప్రతిదీ పబ్లిక్ చూస్తున్నారుగా అనే థోరణిలోనే వ్యవహరిస్తున్నారు. దీని తర్వాత బిగ్ బాస్ స్మగ్లర్స్ ని పోలీసులుగా, పోలీసులని స్మగ్లర్స్ గా మార్చాడు. స్మగ్లర్స్ అవతారమెత్తిన ఛాలెంజర్స్ బొమ్మలని త్రో చేయడానికి ఫిక్స్ అయిపోయారు.

బ్లాంకెంట్స్ పెట్టి మరీ చెక్ పోస్ట్ ని క్లోజ్ చేసినా స్పీడ్ గా బొమ్మలని త్రో చేసి ఛాలెంజర్స్ ఫస్ట్ టార్గెట్ ని ఫినిష్ చేసారు. ఇక్కడే రాపాక పోలీస్ గా ఉన్నప్పుడు తనకి బొమ్మ తగిలింది గుర్తుపెట్టుకుని మరీ, బొమ్మలని గట్టిగట్టిగా విసిరింది. అంతేకాదు, అరియానా పోలీస్ గా సీజ్ చేసిన బొమ్మని సైతం లేదంటూ తెచ్చి డ్రాప్ బాక్స్ లో వేసింది. ఇదే విషయాన్ని బిగ్ బాస్ తో వారియర్స్ మొత్తుకున్నా కూడా బిగ్ బాస్ ఛాలెంజర్స్ గెలిచారంటూ తీర్పు ఇచ్చేశాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus