Akhil, Venu Sriram: ఆ దర్శకునితో బన్నీ ప్రాజెక్ట్ లేనట్టేనా?

అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటివరకు నాలుగు సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే కలెక్షన్లను సాధించినా ఈ సినిమా అఖిల్ రేంజ్ హిట్ కాదని చాలామంది భావిస్తారు. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఏజెంట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నటించనున్నారని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన వేణు శ్రీరామ్ కు తొలి సినిమాతో చేదు ఫలితం ఎదురైంది. కథ, కథనం బాగానే ఉన్నా ప్రేక్షకులు ఓ మై ఫ్రెండ్ సినిమాకు కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత నాని హీరోగా ఎంసీఏ సినిమాను తెరకెక్కించి వేణు శ్రీరామ్ సక్సెస్ సాధించారు. ఆ తర్వాత పింక్ రీమేక్ ను పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కించి మరో కమర్షియల్ సక్సెస్ ను వేణు శ్రీరామ్ ఖాతాలో వేసుకున్నారు.

మరోవైపు అఖిల్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. దిల్ రాజు బ్యానర్ లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన థాంక్యూ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అక్కినేని హీరోలతో దిల్ రాజు వరుసగా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం. ఏజెంట్ సినిమాతో అఖిల్ మార్కెట్ కచ్చితంగా పెరుగుతుందని ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఏజెంట్ 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. రెమ్యునరేషన్ తీసుకోకుండా అఖిల్ ఈ సినిమాలో నటిస్తుండగా సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కాల్సిన ఐకాన్ మూవీ ఆగిపోయినట్టేనని తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus