Akhil, Ashu Reddy: అషూరెడ్డికి క్లాస్ పీకిన అఖిల్..! ఏదైనా ఉంటే గేట్ బయటే చెప్తుందట.

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో అఖిల్ ఇంకా అషూరెడ్డి సీజన్ 4ని తలపిస్తున్నారు. అప్పడు మోనాల్ అఖిల్ అన్న మాటలకి అలగడం, బాధపడటం, ఎమోషనల్ డ్రామా పండించడంలో సక్సెస్ అయితే, ఈసారి ఆ బాధ్యతని అషూ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ జరిగాయి. చిన్న చిన్నగా మాటా మాటా అనుకుంటూనే సీరియస్ అయ్యారు. ముఖ్యంగా అషూరెడ్డి సరదాగా అఖిల్ టీజ్ చేస్తుంటే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.

Click Here To Watch NOW

నువ్వు కెప్టెన్ అయితే నీకు గొప్ప, నాకు కాదు అంటూ మాటలు విసిరింది. ఆ తర్వాత నైట్ హౌస్ మేట్స్ అందరితో అఖిల్ మీటింగ్ పెట్టి రూల్స్ చెప్తుంటే, మరి నువ్వు మర్చిపోతే ఏం చేస్తావ్ ? అంటూ కామెంట్స్ విసిరింది. దీంతో అఖిల్ కి కోపం వచ్చింది. ఆ తర్వాత అషూ అన్న మాటలు ఎలా ఉన్నయో చెప్పే ప్రయత్నం చేశాడు. అందరూ నా మాట వింటుంటే, నువ్వు నా ఫ్రెండ్ అయ్యి ప్రశ్నలు వేస్తుంటే ఎలా ఉంటుందంటూ ప్రశ్నించాడు.

దీంతో అషూరెడ్డి ఇంక ఈ షోలో నీతో మాట్లాడను. ఎదైనా ఉంటే గేట్ బయటే చెప్తాను అంటూ చెప్పింది. అఖిల్ ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీస్కున్నాడు. ముమైత్ ఖాన్ తో చెప్పుకుని బాధపడ్డాడు. ఏదైనా ఉంటే గేట్ బయటే మాట్లాడుతుందని అంటోందని, అసలు తన ఉద్దేశ్యం ఏంటో కూడా తెలియడం లేదని అన్నాడు. దీంతో అషూరెడ్డిని ముమైత్ ఖాన్ వెళ్లి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అషూ అసలు వినే స్టేజ్ లో లేదు.

అఖిల్ విషయం మాట్లాడద్దంటూ చెప్పింది. అన్ని మాటలు అంటున్నాడని, మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని చెప్పింది. ఇక్కడ అఖిల్ అషూని అన్నం ఉన్న ప్లేట్ కిచెన్ లో పారేశావని, కనీసం దాని మీద మూత పెట్టి ఉంటే ఎవరైనా తినేవాళ్లు కదా అంటూ కసిరాడు. దీంతో అన్నం ప్లేట్ పారేయమంటావా..? ఎవరైనా తింటారని అలా చేశానని చెప్పింది అషూ. దీంతో అఖిల్ కి ఇంకొంచెం మండింది. చాలా సీరియస్ గా అషూకి వార్నింగ్ ఇచ్చాడు.

మరోవైపు హౌస్ మేట్స్ అందరూ కలిసి వరెస్ట్ పెర్ఫామర్ గా మిత్రాశర్మాని ఎంచుకుని జైల్ కి పంపించారు. కోర్టు సెషన్ లో మిత్రా తీసుకున్న నిర్ణయాన్ని అందరూ తప్పు బట్టారు. నామినేషన్స్ ని తలపిస్తూ ఓటింగ్ చేశారు. మరి ఈ వీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ కి ఎలాంటి క్లాస్ పీకుతాడు అనేది ఆసక్తికరం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus